Begin typing your search above and press return to search.
విశాల్ బీజేపీ ఎమ్మెల్యే అయిపోతాడా?
By: Tupaki Desk | 15 March 2016 10:14 AM GMTతమిళనాట తెలుగోడి జెండా ఎగరేశాడు విశాల్. హీరోగా నిలదొక్కుకోవడమే కాక.. పైరసీ సీడీల వ్యవహారంతో పాటు అనేక సమస్యలపై తనదైన శైలిలో స్పందించి అక్కడి జనాల మనసు దోచాడు. ఇక గత ఏడాది నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ హవా గురించి ఎంత చెప్పినా తక్కువే. శరత్ కుమార్ అండ్ కోను ఎదిరించి.. వాళ్ల అక్రమాల్ని వెలుగులోకి తేవడమే కాదు.. నాజర్, కార్తి లాంటి వాళ్లను కూడగట్టి ఎన్నికల్లో నిలిచాడు. జయకేతనం ఎగురవేశాడు. దీంతో విశాల్ ఇమేజ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో విశాల్ క్రేజ్ ను రాజకీయాలకు కూడా వాడేసుకోవాలని చూస్తున్నారు తమిళ జనాలు.
సూపర్ స్టార్ రజినీకాంత్ - తల అజిత్ లాంటి వాళ్ల కోసం ప్రయత్నించి భంగపడిన భారతీయ జనతా పార్టీ.. విశాల్ ను తమ పార్టీలోకి చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. రెండు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశాల్ కోసం గాలం వేస్తోంది. ఇందుకోసం భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ను రంగంలోకి దించింది ఆ పార్టీ. అతను విశాల్ తో చర్చలు జరుపుతున్నాడు. విశాల్ ఓకే అంటే చెన్నైలోని మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇవ్వడానికి కూడా భాజపా ఓకే అంటోంది. ఆ తర్వాత కూడా పార్టీలో అతడికి కీలక బాధ్యతలు ఇస్తామంటోంది. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ - పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళనాట ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. ఆలోపు విశాల్ సహా కొందరు ప్రముఖ సినీతారల్ని పార్టీలో చేర్చుకోవాలని రాష్ట్ర పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. విశాల్ పార్టీలోకి వస్తే తమిళ జనాలతో పాటు చెన్నైలో ఉండే తెలుగు జనాల దృష్టిని కూడా ఆకర్షించవచ్చని భావిస్తోంది. మరి విశాల్ ఓకే అంటాడా..? భాజపా టికెట్ తీసుకుని ఎమ్మెల్యే అయిపోతాడా..?