Begin typing your search above and press return to search.
'V' ఫర్ విలన్ .. అటు ఇటు అయితే!!
By: Tupaki Desk | 18 Feb 2020 5:45 AM GMTకుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్! మైండ్ గేమ్ .. ఇంటెలిజెన్స్.. రియాలిటీ బ్యాక్ డ్రాప్ తరహా కథాంశాల్లో ఇలాంటి లాజిక్ ఎంతో బలంగా పని చేస్తుంటుంది. నెక్ట్స్ సీన్ లో ఏం జరుగబోతోందో గెస్ చేయడం కష్టమే. ఇక ఇందులో హీరో ఎవరు? విలన్ ఎవరు? అన్నది కూడా కనిపెట్టేయడం అంత సులువేమీ కాదు. ఇలాంటి లాజిక్ లు మ్యాజిక్ ల వల్ల థియేటర్లలో ఆడియెన్ లో ఒక్కసారిగా ఎగ్జయిట్ మెంట్ పెంచేయవచ్చు. బాలీవుడ్ లో రేస్ .. టాలీవుడ్ లో రగడ లాంటి చిత్రాలు ఈ తరహా ఫార్ములాతోనే తెరకెక్కాయి.
ఇప్పుడు ఇంద్రగంటి Vలోనూ ఇలాంటి ట్విస్టేదో ఉంది. ఆ ట్విస్టేమిటి? అన్నది ఇంతకుముందే తుపాకీలో వెల్లడించాం. వీ చిత్రంలో చిత్రవిచిత్రాలుంటాయి.. తాజాగా షాకిచ్చే రకరకాల విషయాలే తెలిసాయి. ఇన్నాళ్లు ఈ మూవీలో సుధీర్ బాబు హీరో.. నాని విలన్ అంటూ ప్రచారం సాగించారు. కానీ వాస్తవానికి ఇందులో సుధీర్ విలన్ అని తెలుస్తోంది. కానీ అతడే హీరో అంటూ కలరింగ్ ఇచ్చారు. ఇక నానీ పాత్ర దీనికి పూర్తి రివర్స్ లో ఉంటుంది. విలన్స్ లో కూడా హీరోలు ఉంటారు అని చెప్పడానికి ఈ పాత్ర ద్వారా ట్రై చేస్తున్నారట. ఇంద్రగంటి పూర్తిగా మైండ్ గేమ్ తో ఈ పాత్రల్ని తీర్చిదిద్దారని తెలుస్తోంది.
అయితే ఇటీవలే థియేటర్లలోకి రిలీజైన `జాను` ఇచ్చిన స్ట్రోక్ ని పాఠాల్ని పరిగణించి ఇకనైనా దిల్ రాజు-టీమ్ Vని బాగా జనాల్లోకి తీసుకెళితేనే మంచిది. వైవిధ్యం ఉన్న సినిమాలకు సంబంధించిన ప్రచారం కూడా అంతే డిఫరెంటుగా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కంటెంట్ విషయంలో ప్రతిదీ దాచేస్తే జనాలకు కనెక్టివిటీ మిస్సవుతోంది. ఇప్పటికే వీ టీమ్ ప్రమోషన్స్ పరంగా వీక్ గా ఉందన్న టాక్ పరిశ్రమలో వినిపిస్తోంది. లీకులు ప్రచారం తప్ప అధికారికంగా సరైన సమాచారం రివీల్ కావడం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.