Begin typing your search above and press return to search.

కొత్త ఇల్లు కొన్న హీరో.. ఇక పెళ్లి ఒక‌టే పెండింగ్!

By:  Tupaki Desk   |   7 Jun 2021 6:30 AM GMT
కొత్త ఇల్లు కొన్న హీరో.. ఇక పెళ్లి ఒక‌టే పెండింగ్!
X
యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ డైల‌మా గురించి తెలిసిన‌దే. ఇటీవ‌ల అత‌డు స‌క్సెస్ లేక‌ ఆశించినంత స్థాయికి చేరుకోలేక‌పోయాడు. ఆరంభం వ‌రుస విజ‌యాల‌తో దూకుడు ప్ర‌ద‌ర్శించినా కొన్నేళ్లుగా వ‌రుస‌ ప‌రాజ‌యాలు ఇబ్బందిపెట్టాయి.

అయితే కంబ్యాక్ అయ్యేందుకు అవ‌కాశం అత‌డి చేతిలోనే ఉంది. విష‌యం ఉన్న స్క్రిప్టుల్ని ఎంచుకుని బ్యాక్ టు బ్యాక్ విజ‌యాలు సాధించాల్సి ఉంది. ఒరేయ్ బుజ్జిగా యావ‌రేజ్ గా ఆడాక‌.. త‌దుప‌రి అతడి నుంచి వేరొక సినిమా ఏదీ రాలేదు. ప్ర‌స్తుతం స్టాండ్ అప్ రాహుల్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు.

ఫిలింన‌గ‌ర్ గుస‌గుస‌ల ప్ర‌కారం.. ఇత‌ర బ్యాచిల‌ర్ హీరోల్లానే అత‌డిపైనా ఇంట్లో పెళ్లి గురించిన ఒత్తిడి ప‌ని చేస్తోంది. ఇప్ప‌టికే అమ్మా నాన్న‌ సంబంధాలు వెతుకుతున్నార‌ని తెలిసింది. 2022లో అత‌డి పెళ్లి జ‌ర‌గ‌నుందిట‌. గ‌తంలో ఓ ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌తో ఎఫైర్ సాగించాడ‌ని ప్ర‌చార‌మైనా ఆ త‌ర్వాత బ్రేక‌ప్ అయ్యింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఇక ఇటీవల హైదరాబాద్ లో కొత్త ఇల్లు కొనుక్కున్న రాజ్ త‌రుణ్ కి పెళ్లికి బాజా మోగేందుకు ఇంకెంతో స‌మ‌యం లేద‌న్న‌దానిపై క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టే.