Begin typing your search above and press return to search.

అర్థరాత్రి మీ ఇద్దరి చాటింగులు తెలుసు.. హీరోయిన్ పై హీరో భార్య ఫైర్

By:  Tupaki Desk   |   12 Nov 2022 5:30 AM GMT
అర్థరాత్రి మీ ఇద్దరి చాటింగులు తెలుసు.. హీరోయిన్ పై హీరో భార్య ఫైర్
X
కొన్ని విషయాలు ఎంత గుట్టుగా సాగుతాయో.. వాటికి సంబంధించిన అంశాలు అంతే గుట్టుగా చోటు చేసుకొని.. విషయాల్ని సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. అందుకు భిన్నంగా కొందరు మాత్రం బయటకు వచ్చి.. తమకు జరుగుతున్న అన్యాయం మీద గళం విప్పుతారు. సామాజిక సమస్యలు.. ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి బయటకు వచ్చి ఇలా చేయటం ఫర్లేదనిపించినా.. వ్యక్తిగతానికి సంబంధించిన సున్నిత అంశాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ.. ఇవేమీ పట్టించుకోకుండా సోషల్ మీడియాకు ఎక్కే వైనం విషయాలు మరింత పీటముడి పడేలా చేస్తాయి. తాజాగా అలాంటిదే బెంగాలీ నటి విషయంలో చోటు చేసుకుంది.

బంగాలిపుల్ రాజ్ దేశ్ లో ఈ మధ్యన దమాల్ అనే పీరియాడికల్ మూవీ ఒకటి విడుదలైంది. అందులో బిద్య సిన్హ సాహ మిమ్ హీరోయిన్ గా నటిస్తే.. సియామ్ అహ్మద్ హీరోగా నటించారు. సినిమా చేయటం వరకు ఓకే అయినా.. వారి వ్యవహారం వ్యక్తిగతంగా కాస్తంత ముందుకు వెళ్లటం.. సియామ్ అహ్మద్ సతీమణి పొరి మొనికి అస్సలు నచ్చలేదు. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడుతూ.. 'నీ భర్తతో కలిసి పాపులర్ అయ్యేందుకు ప్రయత్నించు' అంటూ బిద్య సిన్హను ఉద్దేశించి ఒక పోస్టు పెట్టింది.

దీంతో ఆమె స్పందిస్తూ.. కొందరు తన విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్నట్లుగా పేర్కొంటూ ప్రతిస్పందించారు. దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పొరి మొని.. సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. అందులో తానెందుకు రియాక్టు అయ్యానన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. అందరికి కొన్ని విషయాల్ని తెలియజేయాల్సిన అవసరం ఉందన్న ఆమె.. ఈసారి నేరుగా బిద్య సిన్హ సాహ మిమ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

ఏమన్నావు మిమ్ అంటూ.. "నీ విజయాన్ని చూసి కుళ్లకుంటున్నానా? ఎవరో తెలియని వారు అలా అన్నారంటే సరే. ఈ మాటను నువ్వెలా అనగలుగుతున్నావు? పోరన్ మూవీలో నువ్వు.. నా భర్త జోడి బాగుందని.. మీరిద్దరూ మరిన్ని సినిమాలు చేయాలని నేనే కదా ఎన్నోసార్లు అన్నాను. మీ అమ్మతో కూడా ఇదే మాట అన్నాను. ఆ విషయాన్ని ఎలా మర్చిపోయావు? మీరిద్దరు లైన్ క్రాస్ చేస్తున్నారు. మీ ఇద్దరి భాగోతం వల్ల నా జీవితం నాశనం కావటమే కాదు పిల్లాడి జీవితం కూడా దెబ్బ తింటుంది" అని మండిపడింది.

అదే సమయంలో.. అదే పోస్టులో భర్త రాజ్ ను ఉద్దేశించి.. 'నువ్వు దమాల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నావని తెలుసు. కానీ అది అడ్డు పెట్టుకొని నా జీవితాన్ని నరకంగా మార్చుతున్నావు. మీరిద్దరు రాత్రిళ్లు ఫోన్లు మాట్లాడుకోవటం.. చాటింగ్ లు చేసుకోవటం నాకు తెలుసు. అది ప్రమోషన్స్ కోసమో.. సినిమ విషయాలో అని చెప్పి ఆ విషయాన్ని దాట వేస్తావని తెలుసు. అలా అర్థరాత్రి వేళ ఫోన్ మాట్లాడటం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి దీన్ని ఆపేయండి' అంటూ వివరంగా అన్ని విషయాల్ని బయటపెట్టేసింది. ఈ వ్యవహారం ఇప్పుడా విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.