Begin typing your search above and press return to search.
డ్రైవర్ కొడుకు 250 కోట్లు కొల్లగొట్టాడు!
By: Tupaki Desk | 10 Feb 2019 1:12 PM GMTఒక సాధారణ డ్రైవర్ కొడుకు.. ఎవరికీ సాధ్య ం కాని అసాధారణ ఫీట్ వేశాడు. నటవారసత్వ ం రాజ్యమేలే పరిశ్రమలో వారసుల్ని సైతం వెనక్కి నెట్టి ఇండస్ట్రీ బెస్ట్ రికార్డును అందుకున్నాడు. భారతీయ సినిమా చరిత్రలో ఇదో సంచలనం. ప్రస్తుతం అతడు డ్రైవర్ కొడుకు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ నంబర్ 1 హీరోగా ఎదిగాడు. ``అసలు ఈ హీరో ఎవరు? కర్నాటక దాటి వస్తే ఎవరికైనా తెలుసా?`` అంటూ సంజయ్ దత్ అంతటి వాడే అతడి సినిమాలో నటించను పొమ్మన్నాడు. అలా అన్నవాడే ఇప్పుడు ఆ డ్రైవర్ కొడుకు నటించబోతున్న సీక్వెల్ సినిమాలో విలన్ గా నటించేందుకు ఓకే చెప్పాడు. అంత గొప్ప జర్నీ ఎవరిది? అంటే చెప్పాల్సిన పనే లేదు. కన్నడ యంగ్ హీరో యశ్ సాధించిన ఘనత ఇది.
యశ్ అన్న పేరు చెబితేనే కన్నడ పరిశ్రమ షేక్ అవుతోంది. శివరాజ్ కుమార్ లు.. రాజ్ కుమార్ ల శకం పోయి యశ్ యుగం వచ్చింది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇది అసాధారణ ఫీట్. ఒకే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు ఒకే ఒక్క సినిమా అతడి దశ దిశ తిప్పేసింది. కేజీఎఫ్ - ఛాప్టర్ 1 సంచలన విజయం సాధించి ప్రస్తుతం యశ్ ని ఇంటర్నేషనల్ స్టార్ ని చేసేసింది. ఈ సినిమా ముగింపు కలెక్షన్స్ లిస్ట్ ఇంకా రాలేదు. అంతకు ముందే దాదాపు 243కోట్లు వరల్డ్ వైడ్ వసూళ్లు సాధించిందని రిపోర్ట్ అందింది. కేవలం 50 రోజుల్లో సాధించిన వసూళ్లు ఇవి.
కేజీఎఫ్- 1 ఇంకా వసూళ్లు సాగిస్తూనే ఉంది. ఈ సినిమా తర్వాత రిలీజైన హేమాహేమీలంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడి డీలా పడిపోతే ఇది ఇంకా వసూలు చేస్తూనే ఉంది. కేవలం ఒక్క కర్నాటకలోనే వసూలు చేస్తోందా? అంటే అన్నిచోట్లా అదే హవా. కర్నాటకలో బాహుబలి 2 చిత్రం 100 కోట్లు సుమారు వసూలు చేస్తే ఆ రికార్డును బ్రేక్ చేస్తూ కేజీఎఫ్ 1 చిత్రం ఏకంగా 137 కోట్ల వసూళ్లు సాధించిందని ట్రేడ్ చెబుతోంది. అటు ఉత్తరాదినా పలు చోట్ల ఇంకా డీసెంట్ గా వసూళ్ల హవా సాగిస్తోందిట. షారూక్ జీరో, అమీర్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద జీరోలు అయిపోతే.. కేజీఎఫ్ ఉత్తరాదినా ఎవరూ ఊహించని రీతిలో అసాధారణ విజయం సాధించింది. అక్కడ 50 రోజుల్లో 44 కోట్లు వసూలు చేసింది. ఒక అనామక హీరోకి అంత పెద్ద వసూళ్లు అంటే ఆషామాషీ కాదని అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ లో రిలీజైపోయింది. అయినా థియేటర్లకు వచ్చి చూస్తున్నారట. అంటే ఆ క్రేజును అర్థం చేసుకోవాలి.
కేజీఎఫ్ విజయం ప్రపంచానికి ఒక గొప్ప గుణపాఠం. బాహుబలి తర్వాత మళ్లీ ఆ క్రేజు ఓ సౌత్ సినిమాకే దక్కిందనడంలో సందేహం లేదు. స్టీరియో టైప్ కథలతో కాకుండా ఒక మంచి కాన్సెప్టు ఉన్న సినిమా వస్తే జనం ఆదరిస్తారనడానికి ఇదే సింబాలిక్. ముఖ్య ంగా కర్నాటకలో కోలార్ బంగారు గనుల్లో బానిసత్వ ం, మాఫియా అన్న ఎలిమెంట్ ఇంత పెద్ద రేంజులో వర్కవుట్ అవుతుందని దర్శకుడు ఇంద్ర నీల్ కానీ, హోంబలే నిర్మాతలు కానీ ఊహించి ఉండరు. ఇక కేజీఎఫ్ - ఛాప్టర్ 2 చిత్రం ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో సంజయ్ దత్ విలన్ గా నటించనున్నారని తెలుస్తోంది.