Begin typing your search above and press return to search.
లైఫ్ స్టోరీ: టీ అందించి స్టార్ హీరో అయ్యా..
By: Tupaki Desk | 28 April 2020 2:30 AM GMTకన్నడ స్టార్ హీరో యశ్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 2018 డిసెంబర్ లో విడుదలైన కేజీఎఫ్ మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి సంచలనమే సృష్టించింది. అంతేగాక విడుదలైన అన్నీ బాషలలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 రానున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సినిమాతో సైలెంట్ గా వచ్చి హీరో యశ్ ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాడు. అంతకముందు యశ్ కేవలం కన్నడ అభిమానులకు తప్ప బయట ఏ ఇండస్ట్రీలోను తెలీదు. కానీ ఇప్పుడు యశ్ అంటే ఓ స్టార్. కన్నడ చిత్రపరిశ్రమ స్థాయినే పెంచేసిన యశ్.. తాజాగా తన చిన్ననాటి విషయాలను బయట పెట్టాడు.
“నేను ఇంటి నుంచి పారిపోయి బెంగళూరుకు వచ్చేశా. అక్కడకు వెళ్లిన తర్వాత ఇంత పెద్ద నగరంలో ఎలా బ్రతకాలో తెలీదు. కానీ, ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని విడువలేదు. బెంగళూరుకు చేరుకునేసరికి నా జేబులో కేవలం రూ.300 మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో తిరిగివెళ్లి తల్లిదండ్రులకు ముఖం చూపించలేను. అందుకే యాక్టర్ గా నా అదృష్టాన్ని పరిష్కరించు కోవాలని డిసైడ్ అయ్యాను. ఒకవేళ యాక్టర్ కాలేకపోతే.. నా తల్లిదండ్రులు ఏం చెబితే అది చేసేవాడిని. అయితే నేను తిరిగి వచ్చేస్తానని వారు భావించారు. లక్కీగా ఓ వ్యక్తి నన్ను థియేటర్ లోకి తీసుకున్నాడు.
ఆ సమయంలో ఆ పని గురించి నాకు ఏమి తెలియదు. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టా. టీ అందించడం నుంచి ఎన్నో రకాల పనులు చేశా.. ఎన్నో ప్రదేశాలు తిరిగా. స్టేజీపై నా తొలి ప్రదర్శనను గుర్తించి, అవకాశం ఇచ్చారు” అని యశ్ తన లైఫ్ లోని మూమెంట్స్ పంచుకున్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా దేశవాప్తంగా వీరాభిమానులు హీరో యశ్ కేజీఎఫ్2 లో ఏం చేయబోతున్నాడో.. ఎలా కేజీఎఫ్ కి డాన్ అయ్యాడోనని చూడటానికి ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా మొత్తం తలకిందులు అయింది. చూడాలి మరి త్వరలో ఏదైనా తీపికబురు చెప్తాడేమో..!