Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ స్టార్ ఫ్యామిలీ రెంట్ కట్టలేదట!
By: Tupaki Desk | 24 March 2019 11:09 AM GMT'కేజీఎఫ్: చాప్టర్ 1' తో రాకింగ్ స్టార్ యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించాడు. దీంతో ఇప్పడు యష్ కు సంబంధించిన ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రీసెంట్ గా యష్ కుటుంబం హౌస్ రెంట్ వివాదం హాట్ టాపిక్ అయింది. యష్ ఫ్యామిలీ బనశంకరి ఏరియాలోని ఒక ఇంట్లో 2010 నుంచి నివాసం ఉంటోంది. ఇంటి అద్దె 40 వేల రూపాయలు. 2013 నుంచి రెంట్ అట్టడం లేదని ఇంటి ఓనర్లు మొదట సివిల్ కోర్టును ఆశ్రయించారు.
యష్ అమ్మగారు పుష్ప వాదన ఎలా ఉందంటే ఇంటి నిర్మాణం సమయంలో తాము రూ.12.5 లక్షల రూపాయలు ఖర్చుపెట్టామని అందుకే కిరాయి చెల్లించడం లేదని అంటోంది. కానీ ఇంటి ఓనర్లు వాటితో తమకు సంబంధం లేదని.. రెంట్ కట్టాల్సిందే అని వాదించారు. దీంతో కోర్టువారు పుష్ప కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. కానీ పుష్ప అందుకు ఒప్పుకోకుండా హైకోర్టును ఆశ్రయించింది. ఇరువురి వాదనలు విన్న హై కోర్టువారు 23 లక్షల రూపాయలను కట్టాలని.. ఆ మొత్తానికి 9 % లెక్కన వడ్డీని కూడా చెల్లించాలని తీర్పు నిచ్చారు. బకాయిలు చెల్లించి 2019 మార్చ్ 31 వరకూ అదే ఇంటిలో ఉండవచ్చని కోర్టువారు తీర్పునిచ్చారు. అంటే హై కోర్టులో కూడా ఆవిడ కేసు ఓడిపోయారు. రీసెంట్ గా హౌస్ ఎవిక్షన్ నోటీసులు కూడా ఆవిడ అందుకుందట.
దీంతో యష్ అమ్మగారు తనకు ఇంటిలో ఉండేందుకు ఎక్స్ టెన్షన్ ఇవ్వాలని సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారని సమాచారం. ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు కానీ కొందరు నెటిజనులుమాత్రం యష్ ఫ్యామిలీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. రీసెంట్ గా హసన్ లో కోట్ల రూపాయలతో యష్ పెద్ద ప్రాపర్టీ కొన్నాడట. కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఈ రెంట్ వివాదాలు ఏంటని... వాళ్ళ మదర్ కు సంబంధించిన వివాదం సాల్వ్ చెయ్యొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.