Begin typing your search above and press return to search.

అప్పట్లో టీ.. సిగరెట్లు అందించాల్సి వచ్చేది

By:  Tupaki Desk   |   23 May 2019 6:41 AM GMT
అప్పట్లో టీ.. సిగరెట్లు అందించాల్సి వచ్చేది
X
చాలామంది ఓవర్ నైట్ స్టార్ అనే పదాన్ని చాలా కామన్ గా వాడుతూ ఉంటారు. ఒక్క రోజులో స్టార్డమ్ తెచ్చుకున్నారని చెప్పడం వారి ఉద్దేశం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కరోజులో ఆ వ్యక్తి పేరు అందరికీ తెలిసి ఉండొచ్చేమో కానీ వారికి ఒక్కరోజులో ఆ స్టార్ డమ్ వచ్చి ఉండదు. ఆ ఒక్కరోజుకు ముందుకు కొన్ని సంవత్సరాల కృషి.. తపన ఉంటాయి. కేజీఎఫ్ స్టార్ యష్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు.

కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న యష్ అంతకు ముందు కన్నడలో స్టార్ హరో. హీరో కాక ముందు నాటక రంగంలో పని చేశాడు. టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేశాడు. టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరించాడు. సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదట్లో తనను హర్ట్ చేసిన విషయాల గురించి పంచుకుంటూ .. అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే సమయంలో తన చేత అడ్డమైన పనులు చేయించుకోవడం తన మనసుకు బాధ కలిగించేదని చెప్పాడు. స్టార్ డైరెక్టర్ల కింద పని చేసే సమయంలో తన చేత టీ సిగరెట్లు తెప్పించుకునేవారని వివరించాడు. అయితే అలాంటి వాటికి జంకకుండా తన ధ్యేయం కోసం పట్టు విడవకుండా ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు.

యష్ చెప్పేది నిజమే కదా. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలకు తప్ప సాధారణ నేపథ్యం నుంచి వచ్చినవారికి వీఐపీ ట్రీట్మెంట్ ఎలా లభిస్తుంది? అవన్నీ దాటి వస్తేనే రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగలిగాడు.