Begin typing your search above and press return to search.

ఓన్లీ గౌరవం.. గ్లామర్ అయితే వద్దు!

By:  Tupaki Desk   |   26 Sep 2018 5:30 PM GMT
ఓన్లీ గౌరవం.. గ్లామర్ అయితే వద్దు!
X
గతంలో హీరోయిన్లకు పెళ్ళైతే తమ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చేది.. కానీ కాజోల్ - ఐశ్వర్య - కరీనా లాంటి బాలీవుడ్ హీరోయిన్లు ఆ ట్రెండ్ కు స్వస్తి పలికారు. ఇక ఆ బాలీవుడ్ ట్రెండ్ ను సమంతా సౌత్ కి తీసుకొచ్చింది. పెళ్లయినా 'రంగస్థలం'.. 'అభిమన్యుడు' సినిమాలతో హిట్స్ సాధించింది. ఇక రెగ్యులర్ హీరోయిన్స్ లానే హీరో కు ముద్దించింది కూడా.

అంతా బాగానే ఉంది.. సమంతా ట్రెండ్ ను మార్చింది అనేంతలో సీన్ రివర్స్ అయినట్టుగా ఉంది. సమంతాను మన సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామని దర్శకులు అంటే హీరోలు 'నో' చెప్తున్నారట. కారణం ఏంటంటే గౌరవం. అక్కినేనివారి కోడలు.. పైగా అందరితో జెంటిల్మాన్ అని పిలిపించుకునే చైతు వైఫ్. సినిమాలో హీరోయిన్ పాత్ర గౌరవప్రదంగా ఉంటే మాత్రం సమంతాను తీసుకుందామని.. అదే గ్లామర్ టచ్ ఉంటే మాత్రం వేరే హీరోయిన్ ను చూడమని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారట.

వీటితో సంబంధం లేకుండా సమంతా మాత్రం సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ వ్యక్తిగత జీవితం వేరు.. వృత్తి వేరు అని హింట్ ఇస్తోంది. తమిళంలో పరిస్థితి ఎలా ఉందో గానీ తెలుగులో మాత్రం రెగ్యులర్ గ్లామర్ రోల్స్ ఇకపై సమంతా కు దక్కడం కష్టమేనని ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉంటే సామ్ కూడ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలవైపు స్లో గా మొగ్గు చూపిస్తోందని.. ఆ బాటలో వచ్చిన మొదటి సినిమా 'U టర్న్' అని అంటున్నారు.