Begin typing your search above and press return to search.
హీరోల సిండికేట్ - హీరోయిన్ ఆఫర్స్ అవుట్
By: Tupaki Desk | 22 Dec 2018 6:36 AM GMTతెలుగు అనే కాదు ఏ బాషా సినిమా పరిశ్రమలో మనుగడ సాగించాలన్నా లౌక్యం అవసరం. వ్యక్తిగత ప్రాధాన్యాలు ఎన్ని ఉన్నా సందర్భానికి తగ్గట్టు అవసరాలు చూసుకుంటూ సర్దుకుపోవడం ముఖ్యమైన లక్షణం. నా పట్టు నాదే అని బెట్టు చేస్తూ కూర్చుంటే ఇబ్బందులు తప్పవు. అలాంటివి అనుభవంలోకి వస్తే కానీ నేర్చుకోలేం. విషయానికి వస్తే తనో హీరోయిన్. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్లు దక్కించుకుని స్థానాన్ని పదిలపరుచుకుంది. కాకపోతే పాపకు ఒక రకమైన పొగరు. మీడియం రేంజ్ లేదా అప్ కమింగ్ హీరోస్ తో చేయను అంటూ బిల్డప్ ఇస్తూ ఉంటుంది. అలా కొన్ని అవకాశాలు వదులుకుంది కూడా.
హీరో మారిన కారణంగా అడ్వాన్స్ సైతం వెనక్కు ఇవ్వకుండా నిర్మాతలను ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి. కొందరు హీరోలు తమ పక్కన ఆ హీరోయిన్ అయితే బాగుంటుంది అని రికమండ్ చేసినా సదరు దర్శకుడు కథ చెప్పేందుకు వెళ్ళినప్పుడు ఆ హీరోనా అంటూ తిరస్కరించేది. ఈ అనుభవం నలుగురైదురు హీరోలకు అనుభవమయ్యింది. తీరా చూస్తే వీళ్లంతా మంచి ఫ్రెండ్స్. తనకు ఎలాగయినా పాఠం నేర్పించాలనుకున్నారు. ఒక సిండికేట్ గా ఫార్మ్ అయిపోయి తనకు వస్తున్న ఆఫర్స్ ని తమ పలుకుబడితో నిలువరించడం మొదలుపెట్టారు.
అంతే కాదు తన కన్నా బెటర్ ఛాయస్ లను వీళ్ళే చూపించడం కూడా చేసారు. దీంతో అవకాశాలు ఆటోమేటిక్ గా తగ్గిపోయాయి. ఇదే పెద్ద దెబ్బ అనుకుంటే ఈ ఏడాది చేసిన మూడు సినిమాలు టపా కట్టేశాయి. చేతిలో ఉన్నది ఒకే ఒక్క ప్రాజెక్ట్. దాని మీదా పాజిటివ్ బజ్ లేదు. దీంతో ఇక్కడ వర్క్ అవుట్ కాదని అర్థం చేసుకున్న సదరు భామ కోలీవుడ్ చెక్కేసి అక్కడ పాగా వేసే పనిలో ఉందట. అయినా చేతి దాకా వచ్చిన అవకాశాల్లో ఏది మంచో ఏది వర్క్ అవుట్ అవుతుందో కాస్త ఆలోచించుకుని నిర్ణయించుకోవాలి కానీ నేను ఫలానా వారితో నటించను అని గిరి గీసుకుంటే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయేమో.