Begin typing your search above and press return to search.

దర్శకులను మధ్యలోనే వదిలేస్తున్న హీరోలు?

By:  Tupaki Desk   |   2 Sep 2019 2:30 PM GMT
దర్శకులను మధ్యలోనే వదిలేస్తున్న హీరోలు?
X
ఒకప్పుడు హీరో ఎవరికైనా దర్శకుడికో నిర్మాతకో సినిమా చేస్తామని మాట ఇస్తే దానికే కట్టుబడి ఉండేవాళ్ళు. కాని ఇప్పుడా ధోరణి లేదు. ముందొక కమిట్ మెంట్ తర్వాత అసలైన టైం వచ్చినప్పుడు లేదు అని తప్పించుకోవడం కొందరు పెద్ద స్టార్లు మొదలుకుని చిన్న హీరోల వరకూ అందరూ చేస్తున్నారు. దీని వల్ల సదరు దర్శకుల కెరీర్లు ప్రమాదంలో పడటమే కాదు నెక్స్ట్ ఎవరితో చేయాలన్న కన్ఫ్యూజన్ తో విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.

వంద కోట్ల మినిమమ్ మార్కెట్ ఉన్న స్టార్ హీరో ఆ మధ్య ఓ దర్శకుడి హ్యాండ్ ఇవ్వడం ట్విట్టర్ లో చేయడం లేదని ప్రకటించడం ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరూ చూశారు. ఆ తర్వాత అదే స్టార్ డైరెక్టర్ కు ఓకే చెప్పిన ఇంకో స్టార్ హీరో ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేయడంలో జాప్యం చేస్తున్నాడు. 2018లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడి పరిస్థితి ఏమిటో వేరే. చెప్పాలా .ఇంకో కేసు చూస్తే గత ఏడాది మీడియం రేంజ్ హీరోకి 60 కోట్ల షేర్ ఇచ్చిన దర్శకుడిని ఓ పెద్ద నిర్మాణ సంస్థ లాక్ చేసుకుంది .

అదిగో పులి ఇదుగో తోక తరహాలో నెలకో హీరో పేరు చెప్పి కాలయాపన చేస్తోంది తప్ప ఖచ్చితంగా అతనితో సినిమా తీస్తారా లేదా అనేది మాత్రం చెప్పడం లేదు. ఇప్పటికే అతను ముగ్గురు హీరోలను కలిసాడు. ఇద్దరు పాజిటివ్ గా రెస్పాండ్ అయినా ఫలితం శూన్యం. ఇదే తరహాలో ఓ మాస్ హీరోకు ఇచ్చే పది కోట్లే ఎక్కువనుకుంటే ఇంకో 4 కోట్లు అదనంగా డిమాండ్ చేసి ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడిని త్రిశంకు స్వర్గంలో పడేయడం ఇప్పటికే ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా హీరోల వ్యవహార శైలి చూస్తుంటే నడిసముద్రంలో వదిలేసే తీరు గుర్తుకువస్తుంది.