Begin typing your search above and press return to search.
అర్జెంట్ గా మాకొక హిట్టు కావలెను..!!
By: Tupaki Desk | 30 Nov 2021 11:30 PM GMTటాలీవుడ్ లో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోలు చాలా మందే ఉన్నారు. ప్లాపులతో ఢీలా పడ్డ యువ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకూ అందరూ అర్జెంటుగా ఒక హిట్టు కావలెనని కష్టపడుతున్నారు. కరోనాకు ముందు సక్సెస్ లేని కొందరు హీరోలు.. ఇప్పుడు పాండమిక్ తర్వాత హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతున్నారు. ఈ క్రమంలో మరికొందరు హీరోలు బ్లాక్ బస్టర్ అందుకోవాలనే ఆశతో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. అందులోనూ బాలకృష్ణ - నాని - నాగశౌర్య వంటి ముగ్గురు హీరోలు ఒకటీ రెండు వారాల గ్యాప్ లో డిసెంబర్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
నందమూరి బాలకృష్ణ చాలా కాలంగా సాలిడ్ సక్సెస్ కోసం వేచి చేస్తున్నారు. 'పైసా వసూల్' తర్వాత 'జై సింహా' 'ఎన్టీఆర్ కథానాయకుడు' 'ఎన్టీఆర్ మహనాయకుడు' 'రూలర్' వంటి సినిమాలతో పరాజయాలు చవిచూశారు. దీంతో ఇప్పుడు 'అఖండ' విజయం సీనియర్ హీరో మార్కెట్ కు కీలకం కానుంది. తనకు గతంలో హిట్టిచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ - సాంగ్స్ సినిమాపై బజ్ తెచ్చిపెట్టాయి. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాక్సాఫీస్ వద్ద నటసింహం అఖండ గర్జన ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
యువ హీరో నాగశౌర్య 'ఛలో' సినిమా తర్వాత ఆ స్థాయి విజయం అందుకోలేకపోయారు. అప్పటి నుంచి హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తున్నా పరాజయాలే పలకరిస్తున్నాయి. 'కణం' 'అమ్మమ్మగారిల్లు' 'నర్తనసాల' 'అశ్వద్ధామ' వంటి సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందించలేకపోయాయి. మధ్యలో 'ఓ బేబీ' సినిమా హిట్టైనా అది సమంత ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇటీవల వచ్చిన 'వరుడు కావలెను' హిట్ టాక్ తెచ్చుకున్నా.. ఆశించిన కలెక్షన్స్ ను మాత్రం రాబట్టలేకపోయింది. దీంతో ఇప్పుడు 'లక్ష్య' సినిమాపైనే యువ హీరో ఆశలు పెట్టుకున్నారు. అర్చరీ నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం శౌర్య పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది. డిసెంబర్ 10న థియేటర్లలోకి వస్తున్న నాగశౌర్య.. ఈసారైనా తన లక్ష్యాన్ని చేరుకుంటాడో లేదో చూడాలి.
హీరో నాని 'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. 'జెర్సీ' తర్వాత మరో థియేట్రికల్ సక్సెస్ కోసం వేచి చూసిన నాని.. కరోనా ముందు 'గ్యాంగ్ లీడర్' సినిమాతో ఆశించిన విజయం అందుకోలేకపోయారు. పాండమిక్ నేపథ్యంల నేరుగా ఓటీటీలో విడుదలైన 'వి' 'టక్ జగదీష్' చిత్రాలు మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. ఈసారి ఎలాగైనా థియేట్రికల్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయిన నాని.. డిసెంబర్ 24న పాన్ సౌత్ ఇండియా మూవీగా 'శ్యామ్ సింగ రాయ్' ని రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేచురల్ స్టార్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. టాక్సీవాలా దర్శకుడు రూపొందించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వచ్చిన సాంగ్స్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. మరి ఈ సినిమా నేచురల్ స్టార్ కి ఎలాంటి హిట్ అదిస్తుందో చూడాలి.