Begin typing your search above and press return to search.

విలన్స్ లో స్టార్ విలన్స్ వేరయా!!

By:  Tupaki Desk   |   25 May 2016 11:30 AM GMT
విలన్స్ లో స్టార్ విలన్స్ వేరయా!!
X
ఇప్పటివరకూ స్టార్ హీరో అన్న మాట మాత్రమే వినిపించేది. విలన్స్ కి స్టార్ అనే ట్యాగ్ తగిలించే ఫార్మాట్ లేదు. కానీ ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో స్టార్లు గా వెలుగుతున్న హీరోలే.. విలన్ రోల్స్ చేయడం చూస్తుంటే.. త్వరలో ఈ కొత్త టెర్మినాలజీ కూడా మొదలైపోతుందేమో అనిపిస్తుంది.

తన ఎంతటి విభిన్నమైన యాక్టర్ అనే విషయాన్ని.. 24తో సూర్య మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మూవీలో కేవలం కుర్చీకే పరిమితమయ్యే పాత్ర విలన్ ఆత్రేయ. లుక్ నుంచి యాక్టింగ్ వరకు అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అయినా సరే సినిమా అంతా అయ్యాక.. ఆత్రేయ కుర్చీకే సెటిల్ అయ్యే రోల్ అంటే నమ్మలేం. అంతగా ఆ రోల్ పండిచాడు సూర్య.

టాలీవుడ్ లో హీరో అయినా బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. బాఘీ చిత్రం కోసం విపరీతంగా కండలు, బాడీ పెంచడం మాత్రమే కాదు.. బోలెడన్ని మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుని చూపించాడు. చేసేది విలన్ రోల్ అయినా.. సుధీర్ బాబు వేసిన కాస్ట్యూమ్స్ కూడా నార్త్ లో బాగా హైలైట్ అయ్యాయంటే.. ఈ రోల్ ఇంతగా క్లిక్ అయిందో అర్ధమవుతుంది.

సరైనోడు చిత్రంతో విలన్ గా మారిపోయాడు ఆది పినిశెట్టి. ఓ స్టార్ హీరో సినిమాలో మరో హీరో విలన్ గా చేయడం జగపతిబాబుతో స్టార్ట్ అయినా.. యంగ్ హీరోలు ఈ టర్న్ తీసుకునేందుకు స్ఫూర్తిగా నిలిచింది సరైనోడు. ఈ మూవీ విజయంలో హీరోతో పాటు వైరం ధనుష్ గా ఆది చేసిన రోల్ కూడా కీలక పాత్ర పోషించింది.

ఇక బాహుబలిలో భల్లాలదేవుడైన రానా గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇండస్ట్రీలో తనే సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో.. ఓ సినిమాకి మూడేళ్లు కేటాయించడం.. అది కూడా విలన్ రోల్ కోసం అంటే పెద్ద రిస్క్ చేసినట్లే. కానీ అందుకు తగ్గ రిజల్ట్ అందుకున్నాడు దగ్గుబాటి రానా.

మొత్తం మీద స్టార్ హీరోలు అంటే.. మంచోళ్లు - విలన్ లను చితకబాదేవాళ్లు అనే ట్రెండ్ కి బ్రేక్ పడుతున్నట్లు అనిపిస్తోంది. కేరక్టర్ లో దమ్ముంటే క్రూరమైన విలన్ రోల్స్ తో.. ఆడియన్స్ ని కట్టిపడేస్తున్నారు. స్టార్ విలన్ అనే కొత్త టెర్మినాలజీకి జీవం పోస్తున్నారు.