Begin typing your search above and press return to search.

అందరినీ కుళ్ళుకునేలా చేస్తున్న హీరో!

By:  Tupaki Desk   |   18 Sep 2018 5:42 AM GMT
అందరినీ కుళ్ళుకునేలా చేస్తున్న హీరో!
X
ఎప్పుడూ కనబడని లగ్జరీ కారు ఏదైనా మనం వెళ్తున్న రోడ్ లో కనిపించిందనుకోండి.. అప్రయత్నంగా మన కళ్ళు ఆ కారుపై కివెళతాయి. ఇప్పుడు ఆడిలు. బీఎండబ్ల్యూలు.. బెంజ్ లు కామన్ అయ్యాయి కదా.. దీంతో అందరూ ఈ కార్లను నోరెళ్ళబెట్టి చూడడం లేదు. అదే బంజారాహిల్స్.. జూబ్లీ హిల్స్ ఏరియాలో ఆ బ్రాండ్స్ ఇంటికొక కారు చొప్పున ఉంటాయి కాబట్టి వారికి అవన్నీ కామనే. కానీ అక్కినేని నాగ చైతన్య మాత్రం త ఫెరారీ కారుతో అందరినీ కుళ్ళుకునేలా చేస్తున్నాడట..!

ఫెరారీ 488 మోడల్ రెడ్ కలర్ కార్ లో చైతు స్వయంగా నడుపుతూ తుర్రు బుర్రున దూసుకుపోతున్నాడట. అసలే అక్కినేని వారసుడు.. పైగా రెడ్ కలర్ స్పోర్ట్స్ కార్ ను అలా నదుపుకుంటూ వచ్చి ఎక్కడైనా ఫైవ్ స్టార్ హోటల్ లోనో లేదా మరో చోటనో ఆపితే అందరి కళ్ళూ అక్కినేని బాబుని.. బాబు కారును చూసి కుళ్ళుతో చచ్చిపోతున్నాయట. ఈ కారు 3900 CC ఇంజిన్ తో పవర్ ఫుల్ గా ఉంటుంది. ధర రూ.. 3.88 కోట్లకు పైమాటే. ఈ బంజారా హిల్స్ లో చాలామంది ఈ కారును కొనగలరు గానీ కారును నడపాలంటే స్పెషల్ ట్రైనింగ్ అవసరమట. చైతూ కు రేసింగ్ లో ఎక్స్ పర్ట్ కాబట్టి ఈ ఫెరారీ ని సులువుగా నడిపేస్తున్నాడట.

నాలుగు కోట్లు పెట్టి కొన్న కార్ను డ్రైవర్ నడిపితే ఏం థ్రిల్ ఉంటుంది? అందుకే ఇలాంటి కారును వేరేవాళ్ళు కొనడం లేదట. కానీ చైతును చూసి మాత్రం గట్టిగా జెలసీ ఫీల్ అవుతున్నారట. ఈ ఆర్టికల్ చదవండి గానీ గట్టిగా 'జెలసీ' అని పైకిమాత్రం అనొద్దు. డైరెక్టర్ మారుతి విన్నాడంటే జెలసీ క్యారెక్టర్ తో ఒక సినిమా తీసి మన మీదకే వదులుతాడు.