Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: డియర్ తేజ.. ఎక్కడుంది లోపం?
By: Tupaki Desk | 2 Sep 2021 12:30 PM GMTస్టార్ డైరెక్టర్ తేజ టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నవతరం హీరోలను తెరకు పరిచయం చేసి బ్లాక్ బస్టర్లు కొట్టడం ఆయన ప్రత్యేకత. కథే బలంగా ఆయన చిత్రాలు సాగుతుంటాయి. కేవలం కంటెంట్ తో హిట్ కొట్టే దర్శకుల్లో ముందుండే పేరు ఆయనదే. తేజ కెరీర్ మొత్తం చూస్తే స్టార్ హీరోతో చేసిన సినిమా ఏదైనా ఉంది ! అంటే `నేనే రాజు నేనే మంత్రి` చిత్రం ఒక్కటే అవుతుంది. టాలీవుడ్ హంక్ రానా కథానాయకుడిగా తెరకెక్కించిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. పొలిటికల్ సెటైరికల్ బ్యాక్ డ్రాప్ లో సాగిన చిత్రంతో తేజ లో మరో కోణం ఆవిష్కృతం అయింది.
తేజలో ఈ యాంగిల్ కూడా ఉందని టాలీవుడ్ మొత్తం ముక్కున వేలేసుకుంది. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ తో `సీత `అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రం తెరకెక్కించారుగానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ వెంటనే మళ్లీ రామానాయుడు కాంపౌండ్ లోనే విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ సినిమా ఇప్పటివరకూ రూపు దాల్చలేదు. దీంతో ఈ సినిమా రద్దయిందని ప్రచారం సాగుతోంది. అంతేకాదు వెంకీకి వినిపించిన కథతోనే గోపీచంద్ ని లాక్ చేసినట్లు ప్రచారమైంది. చాలా కాలం క్రితమే `అలివేలు వెంకటరమణ` అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందని ప్రచారం సాగుతోంది.
ఈ సినిమా కోసం స్టార్ హీరోయిన్ ని దించాలని తేజ గట్టి ప్రయత్నాలే చేసినట్లు తెలిసింది. అనుష్క..సమంత..సాయి పల్లవి.. కీర్తి సురేష్ లను సంప్రదించారట. చివరిగా కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. పీపూల్స్ మీడియా ప్యాక్టరీ కూడా నిర్మాణానికి రెడీ అవుతోందిట. కానీ ఇంతలోనే ఏమైందో.. బ్యాడ్ న్యూస్.. ఈ సినిమా ఆగిపోయినట్లు మీడియాలో కథనాలొస్తున్నాయి.
దీంతో పాటు రానాతో తేజ మరో చిత్రం కూడా తెరకెక్కిస్తున్నట్లు ఓ ప్రకటన వచ్చింది. అదే `రాక్షసరాజు రావణాసురుడు`. కానీ ఈ సినిమా గురించి రానా స్పందించలేదు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన చేతిలో కేవలం రెండు చిత్రాలే ఉన్నాయని అన్నారు. `మిలిందరావు` ..హిరణకశ్యప చిత్రాల గురించే ఆయన మాట్లాడారు. అలాగే తేజ కూడా ఈ సినిమా గురించి ఈ మధ్య కాలంలో ఎక్కడా మాట్లాడింది లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ కూడా అటకెక్కినట్లే కనిపిస్తోంది. ఏక కాలంలో తేజ ప్లాన్ చేసుకున్న చిత్రాలన్ని ఇలా అనూహ్యంగా రద్దవడం వెనుక అసలు కారణాలు ఏమై ఉంటాయో తెలియాల్సి ఉంది.
ట్యాలెంటెడ్ దర్శకుడిలో ఆ కోణం ఏమైంది?
అసలు తేజ అంటేనే ప్రేమకథా చిత్రాలకు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లకు కేరాఫ్ అడ్రెస్. ప్రతిసారీ కొత్త ముఖాన్ని తెరకు పరిచయం చేసి సంచలనాలు సృష్టించడం తనకే చెల్లింది. పరిశ్రమలకు ఉదయ్ కిరణ్.. నితిన్ లాంటి హీరోలను పరిచయం చేసింది తేజనే. ఒక చిత్రం తో ఆది పినిశెట్టిని.. మొదటి సినిమాతో నవదీప్ ని హీరోల్ని చేసారు తేజ. అనిత.. సదా లాంటి కథానాయికల్ని పరిచయం చేసి లైఫ్ నిచ్చారు. కమెడియన్ సునీల్ ని... సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ని పరిచయం చేసింది ది గ్రేట్ తేజ. ఫుల్ క్రైసిస్ లో ఉన్న గోపిచంద్ ని విలన్ ని చేసి బ్రేక్ ఇచ్చింది తేజనే. వీరంతా పెద్ద స్థాయికి ఎదిగారంటే అది తేజ వేసిన ఫౌండేషన్ అనే చెప్పాలి. కానీ ఇటీవలి కాలంలో వీళ్లెవరూ తేజ వెంట ఉన్నట్టు లేదు. ఉదయ్ కిరణ్ బలవన్మరణం తెలిసినదే. నితిన్ ప్రస్తుతం ట్రెండీ దర్శకులతో పని చేస్తున్నారు. గోపిచంద్ కానీ.. సునీల్ కానీ ఇటీవల తేజతో సినిమాలు చేసిందేమీ లేదు. బహుశా తేజ స్ట్రగుల్ లైఫ్ వల్ల వీరంతా డిస్కనెక్ట్ అయ్యారా? లేక తన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలోనో లేదా ఛాన్సుల్ని క్రియేట్ చేసుకోవడంలోనో ఆయనలో ఏదో తేడా జరుగుతోందా? ఏదేమైనా తేజకు పాత రోజులు తిరిగి రావాలని ఆకాంక్షిద్దాం. వరుసగా వెబ్ సిరీస్ లు .. వెబ్ కంటెంట్ తో కొత్త తరం కుర్రాళ్లు కూడా షైన్ అవుతుంటే తేజ ఎందుకనో వీటన్నిటికీ దూరంగా ఉన్నారు.. రీజన్ ఏంటో ఆయనే చెబుతారేమో?