Begin typing your search above and press return to search.
హీరోలే విలన్లు...కటౌట్ కాదు క్యాలిబర్!
By: Tupaki Desk | 4 Jan 2022 8:30 AM GMTఒకప్పుడు విలన్ పాత్ర పోషించాలంటే ప్రత్యేకంగా ముంబై నుంచి దించాల్సి వచ్చేది. స్టార్ హరోకి దీటైన కటౌట్ ట్లు అక్కడే దొరుకుతాయి కాబట్టి దాదాపు టాలీవుడ్ దర్శకులంతా ముంబై మీదనే అధారపడేవారు. డైలాగులకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు గానీ..ఆహార్యం విషయంలో సరిగ్గా టాలీవుడ్ హీరోలకు మ్యాచ్ అయ్యేవారు. అయితే ఇప్పుడు విలన్ల ట్రెండ్ మారింది ఇప్పుడు. స్ర్కిప్ట్ ల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. దర్శకుడు విలన్ పాత్రని సైతం హీరోకి దీటుగా మలుస్తున్నారు. దీంతో యాక్షన్ సన్నివేశాలకే కాదు..నటనకు ఎంతో స్కోప్ దొరుకుతుంది.
అందుకే ఇప్పుడు కటౌట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ కటౌట్ తో పాటు క్యాలిబర్ కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు. అందుకే కంటెంట్ కంటే క్యాలిబర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ది బెస్ట్ నటుల్ని విలన్లగా ఎంపిక చేస్తున్నారు. ఇంకా అవసరం అనుకుంటే ఇతర భాషల హీరోల్నే విలన్లుగా మార్చేస్తున్నారు. ఓసారి అలాంటి హీరో కమ్ విలన్ పై ఓలుక్ ఏస్తే...
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్ గా కన్నడ హీరో `దునియా` విజయ్ ని ఏరికోరి ఎంపిక చేసారు.
కన్నడలో యాక్షన్ హీరోగా విజయ్ కి మంచి పేరుంది. అలాగే ఈయన మంచి నటుడే కాదు దర్శకుడు కూడా. ఇప్పుడు బాలయ్య సినిమాతో విలన్ గా పరిచయం అవుతున్నాడు. ఇక కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతాడు. హీరోగానే సినిమాలు చేయాలని కూర్చొడు. ఎలాంటి పాత్రకైనా సై అంటూ తనకో బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న గొప్ప నటుడు. తెలుగులో `ఉప్పెన` సినిమాలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక మరో కన్నడ నటుడు సుదీప్ అక్కడ ఎంత పెద్ద స్టారో చెప్పాల్సిన పనిలేదు.
అయినా ఇతర భాషల్లో విలన్ గానైనా..ఎలాంటి పాత్రనైనా పోషించడానికి రెడీగా ఉంటాడు. `ఈగ`లో విలన్ గా మెప్పించిన సంగతి తెలిసిందే. `పులి`..`దబాంగ్ -3`లోనూ సుదీప్ విలన్ గా నటించాడు. మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్. ఇటీవలే పాన్ ఇండియా చిత్రం `పుష్ప`తో విలన్ గా పరిచయం అయ్యాడు. పహాద్ నట వివ్వరూపం `పుష్ప `రెండవ భాగంలో చూస్తాం. ఇక కోలీవుడ్ హీరో ఆర్య తెలుగులో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. `వరుడు`..ఎనిమి` సినిమాల్లో బెస్ట్ విలన్ గా మెప్పించాడు. భోజుపురీ నటుడు రవికిషన్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కడ పరిశ్రమలో పెద్ద హీరో. అంతటి స్టార్ హీరో `రేసుగుగర్రం`లో విలన్ గా నటించాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసాడు.