Begin typing your search above and press return to search.

ఒకేసారి ఇన్ని పంచెలు అదుర్స్

By:  Tupaki Desk   |   11 Jan 2016 5:00 PM IST
ఒకేసారి ఇన్ని పంచెలు అదుర్స్
X
సినిమా వాళ్లు స్టైల్ - ఫ్యాషన్ లో కాదు.. సంప్రదాయం - సంస్కతిలను కూడా పక్కాగా ఫాలో అయిపోయతుంటారు. సినిమాల్లో ఎన్నెన్నో కొత్త కొత్త ఫ్యాషన్ లను పరిచయం చేస్తుంటారు వీళ్లంతా. ముఖ్యంగీ హీరోలయితే.. దేశదేశాల ఫ్యాషన్ లన్నిటినీ మనోళ్లకు చూపేందుకు ఉత్సాహం చూపిస్తారు. మరి మన వేడుకలు వచ్చేసరికి, మళ్లీ మన తెలుగు పద్ధతిలో సిద్ధమయిపోతారు.

తాజాగా పొట్లూరి వి ప్రసాద్ కూతురి ఓణీల వేడుకలో.. చాలా మంది హీరోయిన్లు చీరకట్టు సింగారంతో అలరించారు. ఇక సాధారణంగా జీన్స్ ప్యాంట్లు - సూట్లతో దర్శనమిచ్చే హీరోల్లో చాలా మంది పంచె కట్టుతో సందడి చేశారు. అందరిలోకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సోగ్గాడి గురించే. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో పంచె కట్టుతో అలరించనున్నా అక్కినేని నాగార్జున.. ఈ వేడుకకు పూర్తి తెలుగు పంచె కట్టుతో హాజరయ్యారు. ఇక దగ్గుబాటి రాణా - మంచు వారసుడు విష్ణు - హీరో రాజశేఖర్ లు కూడా పంచెలతో వచ్చి ఆకర్షణీయంగా కనిపించారు.

తమిళ హీరోలు ఆర్య - కార్తీలు కూడా తమిళ్ నేటివిటీ పంచెకట్టులో వేడకకు హాజరయ్యారు. ఇలా ఒకేసారి ఇంతమంది సాంప్రదాయ దుస్తుల్లో కనిపించేసరికి.. ఈ విజువల్ భలే చూడముచ్చటగా ఉంది. సాధారణంగా ఒకేసారి కనిపించని వీరందరూ, ఒకేసారి ఒకేతరహా కట్టుబొట్టుతో కనిపించడం.. ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు - తమిళ్ నేటివిటీలు కలిసి.. మొత్తం ఫంక్షన్ భలే ఆకర్షణీయంగా ఉంది.