Begin typing your search above and press return to search.
సగం బడ్జెట్ తో సినిమా తీసి ఆస్తులు కొంటున్న హీరోలు?
By: Tupaki Desk | 24 Nov 2020 2:30 AM GMTఇది వినేందుకు కాస్త వింతగా అనిపించినా కానీ జరుగుతోంది ఇదేనని ఖరాకండిగా చెబుతున్నారు పరిశ్రమ ఇన్ సైడర్స్. తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసి ఎక్కువకి అమ్మేసుకుంటున్న హీరోలపై ఆరాలు తీసి మరీ చెబుతున్నారు..!
ఇటీవల ప్రతి హీరో నిర్మాతగా మారిపోతున్నాడు. కెరీర్ లో సరైన అవకాశాలు రాక...., తామే సొంత బ్యానర్లు పెట్టి సినిమాలు తీసుకుంటున్న హీరోలు ఇప్పుడు ఇండస్ట్రీలో బాగానే ఉన్నారు. అయితే వీరంతా ప్రొడక్షన్ లోకి రావడమే కాకుండా తామే హీరోలుగా సొంత బ్యానర్లలో వరుస సినిమాలు చేస్తున్నారు. అలా చేసిన సినిమాలు జనాదరణకు పెద్దగా నోచుకోనప్పటికీ వీరు మాత్రం కంటిన్యూగా సినిమాలు చేయడం వెనుక పెద్ద ట్రేడ్ సీక్రెట్ ఉంది. హీరోలకి ఉన్న కాస్తంత పేరుతో తక్కువ వడ్డీకి ఫైనాన్స్ పుడుతుంది.
ఉదాహరణకు ఓ సినిమా తీయడానికి 6 కోట్లు అప్పు తీసుకొచ్చి సినిమా తీస్తే అది మొత్తం పూర్తయి సినిమాను రిలీజ్ చేసే లోపు ఫైనాన్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అయితే తీసుకొచ్చిన 6 కోట్ల అప్పుతో కేవలం మూడు కోట్ల లోపే సినిమాను తీసుకుంటున్నారు. మిగతా డబ్బుతో మెయింటైన్స్ తో పాటు ప్రాపర్టీస్ కొనుక్కునే హీరోలున్నారు. ఇక తయారైన సినిమాను డిజిటిల్ రైట్స్.. శాటిలైట్ రైట్స్.. థియేట్రికల్ రైట్స్ రూపంలో ఎక్కువకు అమ్మేస్తున్నారు. ఇలా సినిమాకు ప్రేక్షకాదరణ తో సంబంధం లేకుండా ప్రొడక్షన్ పెట్టి తామే హీరోలుగా నటిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే ఈ పద్ధతి కారణంగా డిస్ట్రీబ్యూటర్లు.. శాటిలైట్.. ఓటిటి వాళ్లకు తీవ్ర నష్టం తప్పడం లేదు. ఈ ట్రెండ్ ఇంకెంత కాలం ఉంటుందో చెప్పలేం.