Begin typing your search above and press return to search.
నయన్ త్యాగం - అనుష్కకు లాభం
By: Tupaki Desk | 19 April 2019 4:32 AM GMTకొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించనప్పుడు ఇష్టం లేకపోయినా స్టార్లు కొన్ని త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంటుంది. అలాంటిదే ఇది కూడా. దర్శకుడు మణిరత్నం కనివిని ఎరుగని రీతిలో భారీ ఎత్తున పొన్నియన్ సెల్వన్ అనే మల్టీ స్టారర్ కు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. విక్రమ్-కార్తీ-జయం రవి-అమితాబ్ బచ్చన్-మోహన్ బాబు ఇలా క్రేజీ స్టార్ క్యాస్ట్ తో వందల కోట్ల బడ్జెట్ తో త్వరలోనే మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇందులో మొదట మెయిన్ హీరోయిన్ గా నయనతారను అనుకున్నారు. కానీ ఇప్పటికే విజయ్ స్పోర్ట్స్ డ్రామాతో పాటు రజనీకాంత్ దర్బార్ కు కమిట్ అయిపోవడంతో మణిరత్నం కోరిన బల్క్ డేట్స్ ఇవ్వలేని స్థితిలో నయన్ దానికి నో చెప్పేసిందని చెన్నై న్యూస్. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు కూడా సైన్ చేసి ఉండటంతో కాల్ షీట్స్ సమస్యను గుర్తించి ఇష్టం లేకపోయినా వదులుకోవాల్సి వచ్చిందట
ఇప్పుడీ స్థానంలో మన స్వీటీ అనుష్కను తీసుకోవచ్చనే టాక్ మొదలైంది . నిజానికి మణిరత్నం పోన్నియన్ సెల్వన్ స్క్రిప్ట్ రాసుకున్నపుడే మొదట అనుష్కనే ఫస్ట్ ఛాయస్ గా పెట్టుకున్నారట. కాని బాహుబలి మేనియాలో ఉన్న ప్రేక్షకులు పోలిక తెస్తారనే అనుమానంతో పాటు మార్కెట్ పరంగా తమిళ్ లో నయన్ అయితేనే బాగుంటుందని సన్నిహితులు సూచించడంతో నిర్ణయం మార్చుకున్నట్టు తెలిసింది.
కాని విధి మరోలా ఉంది. నయన్ త్యాగం చేయడంతో మళ్ళి అది అనుష్క కోర్ట్ కే వచ్చేసింది. తను ఓకే చెప్పిందా లేదా అనే అధికారిక సమాచారం లేదు. భాగమతి తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న స్వీటీ ఇప్పటిదాకా కేవలం కోన వెంకట్ నిర్మాణంలో రూపొందే మూవీ మాత్రమే సైన్ చేసింది. సో మణిరత్నం ఆఫర్ కు ఓకే చెప్పే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది