Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: జీవితం త‌ల‌కిందులు!

By:  Tupaki Desk   |   21 Dec 2018 7:38 AM GMT
ఫోటో స్టోరి: జీవితం త‌ల‌కిందులు!
X
అందం దాచేస్తే దాగేది కాదు. ప్ర‌తిభ‌నూ ఎవ‌రూ అణ‌చి పెట్ట‌లేరు. అందుకు ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రంగుల ప్ర‌పంచంలో ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల చుట్టూ తిరిగే ట్యాలెంటెడ్ గాళ్స్ ఎంద‌రో ఉంటారు. అలానే ఈ అమ్మ‌డు కూడా ఆర్జీవీ చుట్టూ తిర‌గ‌డంతో `వంగ‌వీటి` చిత్రంలో అవ‌కాశం అందుకుంది. అయితే ఆ సినిమాలో అస‌లు న‌టించిందో లేదో కూడా ఎవ‌రికీ తెలీదు. కానీ ఇటీవ‌ల‌ `భైర‌వ‌గీత‌` ట్రైల‌ర్ రిలీజ‌య్యాక మాత్రం ఎవ‌రీ కొత్త బ్యూటీ అన్న చ‌ర్చ సాగింది. ఆ క్రెడిట్ అంతా ఆర్జీవీ కే ఇవ్వాలి. వేరొక కొత్త కుర్రాడు ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా, ఆర్జీవీ ప్ర‌చారం చేయ‌డంతో `భైర‌వ‌గీత‌`కు బోలెడంత ఫ్రీప‌బ్లిసిటీ క‌లిసొచ్చింది.

వివాదాల‌తో ప్ర‌చారం అన్న తీరుగా ఈ ఫ్యాక్ష‌న్ ల‌వ్ స్టోరి చిత్రానికి ప్ర‌మోష‌న్ తేవ‌డంలో వ‌ర్మ స‌క్సెస‌య్యాడు. కానీ అంతిమంగా సినిమా లో కంటెంట్ మాత్ర‌మే కింగ్ కాబ‌ట్టి ఆ సినిమా ఫ‌లితం యావ‌రేజ్ అని తేలింది. అయితే ఈ సినిమాతోనే ఇర్రా మోర్ అనే బ్యూటీ క‌థానాయిక‌గా వెలుగులోకి వ‌చ్చింది. వేడెక్కించే శిరుల్ని తెర నిండుగా ప‌రిచేయ‌డం లో త‌న‌ని కొట్టేవాళ్లే లేర‌ని ఈ భామ ప్రూవ్ చేసింది. దీంతో త‌న‌ కు టాలీవుడ్ లో మ‌రిన్ని అవ‌కాశాలిచ్చి ఎంకరేజ్ చేసేవాళ్లు ఉన్నారిప్పుడు.

తాజాగా ఈ బ్యూటీ ఇండ‌స్ట్రీ వేడెక్కిపోయే ఓ ఫోటోషూట్ తో వార్ లోకి దిగింది. ప‌క్క‌కు ఒరిగిన‌ కుర్చీ .. ఆ కుర్చీలోంచి త‌ల‌కిందులుగా జారిప‌డిన అమ్మాయి.. ఇదీ ఫోటోషూట్ కాన్సెప్ట్!! అందాల్ని మ‌త్తుగా వెద‌జ‌ల్లి వేడెక్కించేందుకు ఉన్న ఆస్కారాన్ని ఇర్రా మోర్ ఏమాత్రం జార‌విడువ‌లేదు. ఇర్రాలోని స్టైలిష్ లుక్ ఆక‌ట్టుకుంది. వేరొక ఫోటోలో త‌డిపొడి అందాల్ని ఆవిష్క‌రించింది. మొత్తానికి ఫోటోషూట్ బ్లాక్‌బ‌స్ట‌ర్. మ‌రి అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేసే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యూలో ఉన్నారా.. లేరా? అన్న‌ది తెలియాల్సి ఉంది.