Begin typing your search above and press return to search.
హీరోయిన్ల కొంప ముంచుతున్న మేనేజర్లు
By: Tupaki Desk | 3 Aug 2019 1:30 AM GMTఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా నిర్మాణం ప్రొడ్యూసర్లకు కత్తి మీద సాములా మారింది. తెలిసింది ఇదొక్కటే కాబట్టి కష్టమో నష్టమో ఇక్కడ పడదాం అని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా వీళ్లకు బడ్జెట్ దగ్గర వస్తున్న సమస్య హీరో హీరొయిన్ల రెమ్యునరేషన్లు వాళ్ళ తాలుకు ఖర్చులు. రాను రాను ఇవి తడిసి మోపెడవుతూ భరించలేని స్థితికి చేరుకుంటున్నాయి.
ముఖ్యంగా కథానాయికల విషయంలో మధ్యవర్తులగా వ్యవహరిస్తున్న మేనేజర్ల వ్యవస్థ వల్లే క్యాస్టింగ్ కౌచ్ లాంటి లైంగిక వేధింపుల కేసులు అధికమయ్యాయనే కామెంట్ ఇండస్ట్రీలో సహజంగా వినిపించేదే. దీనికి కారణం ఉంది. ఒకప్పుడు నటీనటులకు నిర్మాతలకు మధ్య కమ్యునికేషన్ పరంగా చాలా ఇబ్బందులు ఉండేవి కాబట్టి మీడియేటర్ గా మేనేజర్లు వ్యవహరించేవాళ్ళు. రాను రాను ముంబై హీరోయిన్ల తాకిడి పెరగడంతో వారికి బాష రాని కారణంగా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అంతా తమ చెప్పు చేతల్లో ఉంచుకుని డిమాండ్ చేసే లెవెల్ కు కొందరు మేనేజర్లు చేరుకోవడం ప్రొడ్యూసర్లకు శిరోభారంగా మారింది.
ఇది ఎంతగా ముదిరిపోయింది అంటే హీరోయిన్లు డిమాండ్ చేసే స్టార్ హోటల్ వసతులు క్యారవాన్ డిమాండ్లు ఇవన్నీ మేనేజర్లు దగ్గరుండి చెప్పించి మరీ నిర్మాత జేబులు ఖాళీ చేయిస్తున్నారు. కేవలం ఈ పోకడ వల్లే బంగారం లాంటి అవకాశాలు పోగొట్టుకున్న హీరోయిన్లు ఉన్నారు. ఆ నిజాలు తెలియకుండా మేనేజ్ చేస్తున్నారంటే వీళ్ళ హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉదాహరణకు కోటిన్నర తీసుకునే ఓ హీరోయిన్ కేవలం మేనేజర్ బలవంతం మీద యాభై లక్షలు ఎక్కువ వస్తాయన్న కారణంగా ఇండస్ట్రీకొచ్చి నాలుగేళ్లయినా ఒక్క హిట్టు కొట్టని ఓ అప్ కమింగ్ హీరో సరసన నటించింది. కట్ చేస్తే అది డిజాస్టర్ అవ్వడమే కాక ఈ సినిమా ఆమె ఎందుకు ఒప్పుకుందా అని అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకున్నారు.
క్యాస్టింగ్ కౌచ్ ముసుగులో తెరవెనుక వ్యవహారాలు నడిపిస్తున్న వాళ్ళు కూడా ఇందులోనే ఉన్నారు. అందుకే హీరోయిన్లు కొంచెం ఏమరుపాటుతో వ్యవహరించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే ఈ మేనేజర్ల తలనెప్పి నిర్మాతలకు ఆర్ధిక భారం రెండూ తప్పించినవారవుతారు. కాకపోతే అంత ముందు చూపుతో ఆలోచించే వాళ్ళు ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. ఇది హీరోల కంటే హీరొయిన్ల విషయంలోనీ మేనేజర్ల ప్రమేయం పెరిగి ఈ వ్యవస్థ ఎప్పుడు ప్రక్షాళన అవుతుందా అని ఎదురు చూసే నిర్మాతల సంఖ్య పెరిగిపోవడం దాకా వచ్చింది. దీనికి కాలమే సమాధానం చెప్పాలి