Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : బేబీ బంప్‌ తో హీరోయిన్‌ ఫోజులు

By:  Tupaki Desk   |   8 Dec 2020 11:10 AM
ఫొటోటాక్‌ : బేబీ బంప్‌ తో హీరోయిన్‌ ఫోజులు
X
తెలుగు ప్రేక్షకులకు నువ్వు నేను.. శ్రీరామ్‌.. నేనున్నానుతో పాటు పలు సినిమాల్లో నటించిన అనిత కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకుంది. వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్‌ అనే విషయం తెల్సిందే. తాను అమ్మను అవ్వబోతున్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసి తన ఆనందాన్ని షేర్‌ చేసుకున్నఅనిత వరుసగా సోషల్‌ మీడియాలో తన బేబీ బంప్‌ ఫొటో షూట్‌ ను పోస్ట్‌ చేస్తుంది. ఇటీవల మరోసారి అనిత ఈ ఫొటోలను నెట్టింట షేర్‌ చేసింది.

ఈమద్య కాలంలో ముద్దుగుమ్మలు బేబీ బంప్‌ తో సందడి చేయడం కామన్‌ గా కనిపిస్తుంది. సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం ఫొటో షూట్‌ లను మాత్రమే కాకుండా బేబీ బంప్‌ లను చూపించడం చేస్తున్నారు. అనిత కూడా తన బేబీ బంప్‌ తో ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. రెండు నెలల్లో అనిత పండంటి బాబు లేదా పాపకు జన్మనిస్తుందని తెలుస్తోంది. అనిత మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఇలా పబ్లిసిటీ కోరుకుంటుందని.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఖచ్చితంగా సినిమాల్లో నటిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.