Begin typing your search above and press return to search.

విస్కీ లేకుండా ఉండ‌లేద‌ట‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్‌!

By:  Tupaki Desk   |   25 April 2021 11:30 PM GMT
విస్కీ లేకుండా ఉండ‌లేద‌ట‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్‌!
X
‘నాకు విస్కీ అంటే ప్రాణం. అది లేకుండా ఉండ‌లేను’ అంటోంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్! నాలుగేళ్ల క్రితం అల‌వాటైంద‌ని, అది లేకుండా ఒక్క‌రోజుకూడా ఉండ‌లేన‌ని చెబుతోంది. అంత‌గా అడిక్ట్ అయిపోయింద‌ట మ‌రి!

అయితే.. ఇక్క‌డ విస్కీ అంటే ఆల్క‌హాల్ కాదు. ఈ కేర‌ళ కుట్టి పెంపుడు కుక్క‌. పేరు భ‌లేగా ఉంది క‌దూ! మరి, ఇంకో పెట్ డాగ్ పేరు వింటే ఏమంటారో..? దాని పేరు ‘రమ్’. ఇవేం పేర్లు ఇవి తప్ప, ఇంకేమీ దొరకలేదా? అని మాత్రం అడ‌క్కండి. ఆమెకు న‌చ్చింది.. అలా పిలుచుకుంటోంది అంతే!

అయితే.. ఈ రెండు డాగ్స్ కాకుండా మ‌రొక‌దాన్ని కూడా పెంచుకుంద‌ట అనుప‌మ‌. దాని పేరు కూడా ఆల్క‌హాల్ రిలేటెడే కావ‌డం గ‌మ‌నార్హం. దాని పేరు ‘తాడి’. హిందీలో కల్లు అనే అర్థం కూడా వస్తుంది మరి!

కాగా.. ఈ మూడు డాగ్స్ లో ర‌మ్, తాడి ఇదివ‌ర‌కే చ‌నిపోయాయ‌ట‌. వాటి ఎడ‌బాటును త‌ట్టుకోలేక‌పోయిన అనుప‌మ‌.. ‘విస్కీ’ని పెంచుకుంటోందట. అవి రెండు లేని లోటును విస్కీతో పూడ్చుకుంటోందట. అందుకే.. విస్కీ లేకపోతే.. తాను ఉండలేనని చెబుతోందీ బ్యూటీ. అన్నమాట విస్కీ ఫ్లాష్ బ్యాక్.

ఇక‌, ఈ అమ్మ‌డి సినిమాల సంగ‌తి చూస్తే.. గ‌తంలో వ‌చ్చిన ‘రాక్ష‌సుడు’ మూవీ తెలుగులో ఆఖరిది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స‌ర‌స‌న ఈ సినిమాలో న‌టించింది. ప్ర‌స్తుతం ‘18 పేజెస్‌’ సినిమాలో నటిస్తోంది. మరి, ఈ సినిమా అనుప‌మ కెరీర్ కు ఎలాంటి బూస్టింగ్ ఇస్తుందో చూడాలి.