Begin typing your search above and press return to search.
బ్లాక్ మెయిల్ కేసులో అరెస్టయిన హీరోయిన్
By: Tupaki Desk | 3 Dec 2019 5:32 AM GMTమరాఠీ హీరోయిన్ సారా శ్రవణ్ ను పూణే పోలీసులు బ్లాక్ మెయిల్ కేసులో అరెస్ట్ చేశారు. ఈమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దాదాపు ఏడు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియా నుండి పారిపోవడంతో ఈమె రాక కోసం ఇన్నాళ్లు పోలీసులు వెయిట్ చేశారు. ఇటీవల ముంబయిలో అడుగు పెట్టిన విషయం తెలిసి వెంటనే ఆమెను ట్రేస్ చేసి అరెస్ట్ చేసినట్లుగా పుణే పోలీసులు ప్రకటించారు. బ్లాక్ మెయిల్ కేసులో ఈమెను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెళ్లడించారు.
సారా శ్రవణ్ పై నమోదు అయిన కేసు వివరాల్లోకి వెళ్తే.. ఈమె గతంలో సుభాష్ యాదవ్ అనే వ్యక్తితో కలిసి ఒక సినిమాలో నటించింది. ఆ తర్వాత కొంత కాలంకు అతడిపై లైంగిక వేదింపుల కేసును సారా శ్రవణ్ పెట్టింది. ఆ సమయంలోనే తన వద్ద వీడియోలు ఉన్నాయని వాటిని బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. మరో ముగ్గురితో కలిసి సారా ఈ పని చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. 15 లక్షలను సుభాష్ యాదవ్ నుండి రాబట్టేందుకు వీరు ప్రయత్నించారట.
ఈ ఏడాది ఏప్రిల్ లో సుభాష్ యాదవ్ తనను సారా మరియు మరో ముగ్గురు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సారాను మినహా ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. సారా దుబాయి పారిపోవడంతో ఆమె రాక కోసం ఇన్నాళ్లు వెయిట్ చేశారు. ఇన్ని నెలల తర్వాత ఆమె ముంబయిలో దిగగానే అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ పిటీషన్ పెట్టుకున్న సారాకు కోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ వస్తుందనే నమ్మకంతో ఇండియా వచ్చిన సారాకు బెయిల్ రాకపోవడంతో అరెస్ట్ తప్పలేదు. పూణె కోర్టులో ఆమెను హాజరు పర్చినట్లుగా పోలీసులు తెలియజేశారు.