Begin typing your search above and press return to search.

బాంబిసార 2లో రాకాసి.. డైరెక్టర్ క్లారిటీ!

By:  Tupaki Desk   |   29 Aug 2022 8:17 AM GMT
బాంబిసార 2లో రాకాసి.. డైరెక్టర్ క్లారిటీ!
X
కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్ళను అందుకొని అతని కెరీర్ మొత్తంలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు సినిమా విడుదలకు ముందే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

తప్పకుండా సీక్వెల్ కూడా అంతకుమించి అనేలా తెర పైకి తీసుకువస్తామని దర్శకుడు వశిష్ట కూడా ఎంతో నమ్మకంగా తెలియజేశాడు. ఇక ఇప్పుడు సీక్వెల్ గా రాబోయే బింబిసారా 2 ఏ స్థాయిలో ఉంటుందా ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు.

అయితే ఈ క్రమంలో కొన్ని రూమర్లు కూడా ప్రేక్షకులలో కొంత కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి. అలాగే సెకండ్ పార్ట్ లో ఒక అగ్ర హీరోయిన్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది అని కూడా కథనాలు వెలువడుతున్నాయి.

ముఖ్యంగా బింబిసారను ఎదురుకోవడానికి ఒక పవర్ఫుల్ రాకాసిని అని రంగంలోకి దింపుతారు అని ఆ రాక్షసి పాత్రలో ఒక అగ్ర హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వచ్చింది.

ఇప్పటికే కొంతమంది ప్రముఖ హీరోయిన్స్ ను కూడా ఆ నెగటివ్ రోల్ కోసం సంప్రదించినట్లు కూడా అనుకుంటున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో అని దర్శకుడిని సంప్రదించగా అతను అలాంటిదేమీ లేదు అని ఒక్క మాటలోనే క్లారిటీ ఇచ్చేసాడు. ప్రస్తుతం బింబిసార సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపిన డైరెక్టర్ వశిష్ట ఇంకా సెకండ్ పార్ట్ కు సంబంధించిన కథను కూడా పూర్తి చేయలేదు అని అన్నాడు.

ఇంకా దానికి కొంత సమయం పడుతుంది అని పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధమయ్యాక అన్ని వివరాలు తెలియజేస్తాము అని కూడా ఈ దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఏదేమైనా కూడా సెకండ్ పార్ట్ లో ఒక అగ్ర హీరోయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మరి దర్శకుడు సెకండ్ పార్ట్ లో ఎలాంటి నెగటివ్ క్యారెక్టర్ ను హైలెట్ చేస్తాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.