Begin typing your search above and press return to search.

లిప్‌ లాక్‌ ను షేర్‌ చేసిన విశాల్‌ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   31 Aug 2020 3:00 PM
లిప్‌ లాక్‌ ను షేర్‌ చేసిన విశాల్‌ హీరోయిన్‌
X
2007 సంవత్సరంలో విశాల్‌ హీరోగా వచ్చిన 'భరణి' సినిమా గుర్తుందా.. తమిళంలో తెరకెక్కినా కూడా ఆ సినిమాను తెలుగులో కూడా డబ్‌ చేశారు. ఇక్కడ అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో విశాల్‌ కు జోడీగా భాను నటించిన విషయం తెల్సిందే. చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా భానుకు మంచి గుర్తింపు వచ్చింది. ఈమెను తెలుగు మరియు తమిళ ఆడియన్స్‌ ఇంకా కూడా గుర్తు పడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 16వ ఏటనే హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన భాను కొన్నాళ్లకే సినిమాలకు దూరం అయ్యింది. 2015లో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్‌ అయ్యింది.

ప్రముఖ సింగర్‌ రిమి టామీ సోదరుడు అయిన రింకు టామీని ఈమె పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వైవాహిక జీవితం మొదలై అయిదు ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా భాను సోషల్‌ మీడియాలో రింకు టామీని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. నీవు భర్తగా లభించడం నా అదృష్టం. నీవే నా సర్వస్వం అంటూ పోస్ట్‌ చేసి తమ లిప్‌ లాక్‌ ఫొటోను షేర్‌ చేసింది. భాను రింకుల ముద్దు ఫొటో వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం ఈమె రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తమిళంలో ఒకటి రెండు కథలు కూడా విన్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్‌ గా ఆఫర్లు రాకపోవచ్చు. కాని ఈమె క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తుందా అనేది చూడాలి.