Begin typing your search above and press return to search.

క‌త్తి లాంటి పిల్ల‌కు `ఖ‌త‌ర్నాక్` బాడీగార్డ్

By:  Tupaki Desk   |   21 Nov 2021 6:46 AM GMT
క‌త్తి లాంటి పిల్ల‌కు `ఖ‌త‌ర్నాక్` బాడీగార్డ్
X
త‌న‌దైన అందం.. ప్ర‌తిభ.. అథ్లెటిక్ లుక్ తో కుర్రాళ్ల గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచి ఉంది క‌త్రిన‌. రెండున్న‌ర ద‌శాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించింది. బాలీవుడ్ అగ్ర హీరోల స‌ర‌స‌న నాయిక‌గా న‌టించింది. ఇప్పుడు స్టార్ హీరోల‌కు ధీటుగా పారితోషికాలు అందుకుంటూ యాక్ష‌న్ క్వీన్ గానూ అల‌రిస్తోంది. త్వ‌ర‌లో సూప‌ర్ గాళ్ పాత్ర‌తోనూ క‌త్రిన మెప్పించ‌నుంది. భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నాయిక‌గా కత్రినా స‌త్తా చాటుతోంది.

ఆ స్థాయి మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ కి బాడీగార్డ్ అంటే ఎలా ఉండాలి? అంటే ఇదిగో ఈయ‌నే ప్ర‌త్య‌క్ష ఎగ్జాంపుల్. అత‌డిని చూడ‌గానే గాళ్స్ ఫ్లాట్ అయిపోవాల్సిందే. చూడ‌గానే టాప్ మోడ‌ల్ ని త‌ల‌పించే అత‌డి పేరు దీపక్ సింగ్. కత్రీనాకు చాలా కాలంగా బాడీగార్డ్. ఆమె వెంటే నీడ‌లా ప్రతి క్షణం ప్రయాణించడం తరచుగా కనిపిస్తుంది. క‌త్రిన‌తో దాదాపు ప్రతి చిత్రంలో కనిపిస్తాడు. అతను చాలా మంచివాడు. అందమైనవాడు.. ఇప్పుడు అదే స‌మ‌స్య‌గా మారింది.

సోషల్ మీడియాలో దీపక్ సింగ్ పై ప్రశంసలు కుర‌వ‌డ‌మే కాదు.. చాలా మంది హీరోల‌కు అది నెగెటివ్ గా మారింది. ఎప్పటికీ ఆగడం లేదు. క‌త్రిన‌ బాడీగార్డ్ ఆమె ఇప్పటివరకు డేటింగ్ చేసిన చాలా మంది మ‌గాళ్ల‌ కంటే అంద‌గాడ‌ని పొగిడేస్తున్నారు. ఈ వ్యాఖ్య అతనికి ప్రస్తుతం యువతలో ఉన్న క్రేజ్ ను వెల్ల‌డిస్తుంది.

దీపక్ తరచుగా విమానాశ్రయాలలో సెట్లలో .. కత్రినా కైఫ్ తో సినిమా ప్రదర్శనలలో కనిపిస్తాడు. అతను ఎల్లప్పుడూ స్టైల్ ఐకాన్ లా దుస్తులు ధరించి.. స్టార్ ని మ‌రిపిస్తాడు. అత‌డిని చూడ‌గానే టాప్ మోడ‌లా? అనేంత‌గా అత‌డు మ‌రిపిస్తున్నాడు. అయితే అంత‌గా ప్రిపేర్ అవ్వ‌డం వెన‌క కార‌ణ‌మేమిటో ఆరా తీస్తే.. ఇత‌రుల కంటే భిన్నంగా ఉండేందుకే ఈ మేక‌ప్ అని చెబుతున్నాడు సింగ్.

క‌నిపించే రూపం చాలా ముఖ్యం. చక్కగా దుస్తులు ధరించడం ఒక ఎడ్జ్ ని ఇస్తుంది. మీరు సాధారణ సఫారీ ధరిస్తే.. ఈ వ్యక్తి సెక్యూరిటీ గార్డు అనే భావనను అందరికీ కలిగిస్తుంది. కాబట్టి మీరు వీవీఐపీతో ప్రయాణిస్తున్నట్లయితే మీరు ప్రెజెంబుల్ గా కనిపించాలి అని దీపక్ అంటున్నారు.

కత్రినాతో పాటు దీపక్ సింగ్ అనేక మంది తారలతో కూడా పనిచేశాడు. వారికి తాత్కాలికంగా వివిధ సందర్భాలలో భద్రత కల్పించాడు. ఈ జాబితాలో సల్మాన్ ఖాన్- మాధురీ దీక్షిత్- జాక్వెలిన్ ఫెర్నాండెజ్- పారిస్ హిల్టన్- దీపికా పదుకొనే తదితరులు ఉన్నారు.

దీపక్ సింగ్ ఎయిర్ ఫోర్స్ అధికారి కుమారుడు. క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. క్రికెట్ లో అతని ప్రయత్నాలు విఫలమైన తరువాత దీపక్ తన బావ.. నటుడు రోనిత్ రాయ్ నుండి సలహా తీసుకొని ఏసీఈ సెక్యూరిటీలోకి ప్రవేశించాడు. సంజయ్ లీలా భ‌న్సాలీ `బ్లాక్` మూవీ సెట్స్ లో డోర్ మెన్ గా దీపక్ మొదటి సారి క‌నిపించాడు. ఆ త‌ర్వాత సెల‌బ్రిటీ గార్డ్ గా అంద‌రికీ సుప‌రిచితుడ‌య్యాడు. మంచిత‌నంతో ఆక‌ట్టుకుని కెరీర్ లో ఎదిగాడు.