Begin typing your search above and press return to search.

బ్రెస్ట్ ఫీడింగ్ సీన్ లో నటించిన హీరోయిన్‌ వ్యాఖ్యలు వైరల్‌

By:  Tupaki Desk   |   25 Aug 2022 2:30 PM GMT
బ్రెస్ట్ ఫీడింగ్ సీన్ లో నటించిన హీరోయిన్‌ వ్యాఖ్యలు వైరల్‌
X
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బ్రెస్ట్ ఫీడింగ్ సన్నివేశాలు అంటే అశ్లీలం లేదా అసభ్యత సన్నివేశం అన్నట్లుగా అభిప్రాయం ఏర్పడింది. హీరోయిన్స్ స్కిన్‌ షో చేయడం.. క్లీ వేజ్‌ షో చేయడం అనేది కామన్ గా మారినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ సన్నివేశాలను మాత్రం ఏదో మహా పాపం అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు మహా పాపం అన్నట్లుగా చూస్తున్న బ్రెస్ట్ ఫీడింగ్ సన్నివేశం ను మందాకినీ 30 ఏళ్ల క్రితమే చేసి సంచలనం సృష్టించింది. కేవలం అయిదు ఆరు ఏళ్ల సినీ కెరీర్‌ లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన మందాకినీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

బాలీవుడ్‌ స్టార్‌ రాజ్ కుమార్ సూపర్ హిట్ చిత్రం 'రామ్ తేరి గంగా మైలీ' సినిమా తో మందాకిని నటిగా తెరంగేట్రం చేసింది.

మొదటి సినిమాలోనే ఈమె చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రధానంగా సినిమాలో బాబుకు పాలు పడుతూ బ్రెస్ట్ ఫీడింగ్ సన్నివేశంను నిర్మొహమాటంగా చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవడంతో పాటు మాతృత్వంను చాటి చెప్పే ప్రయత్నం చేసింది.

తక్కువ సమయంలోనే సినిమాలను వీడిన మందాకిని జోర్దార్ సినిమా తర్వాత బాలీవుడ్‌ ను వీడి టిబెటన్ యోగా టీచర్ గా మారి పోయింది. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తాను రామ్ తేరి గంగా మైలీ సినిమాలో చేసింది తల్లి పాలు పట్టే సన్నివేశం కాదు. కానీ అలా కనిపించే విధంగా చిత్రీకరించారు. ఆ సన్నివేశం చిత్రీకరణ గురించి చెప్తే చాలా పెద్ద కథ అవుతుంది.

ఆ సమయంలో కాస్త టెక్నికల్ గా జిమ్ముక్కును వాడి సదరు సన్నివేశం ను చిత్రీకరించారు. ప్రస్తుత జనరేషన్ చేస్తున్న స్కిన్‌ షో కు నేను అప్పట్లో చేసింది చాలా తక్కువే. నేనేం అశ్లీల సన్నివేశంలో నటించలేదు. అమ్మతనాన్ని స్వచ్చమైన అమ్మ పాల యొక్క గొప్పతనం ను చూపించే దృశ్యం లో నటించాను అంతే. అదే ఈ రోజుల్లో అయితే లైగింకతగా భావిస్తారేమో అంది.