Begin typing your search above and press return to search.

దర్శకుడిని నపుంసకుడు అన్న హీరోయిన్

By:  Tupaki Desk   |   19 July 2017 5:02 AM GMT
దర్శకుడిని నపుంసకుడు అన్న హీరోయిన్
X
శేఖర్ సూరి.. థ్రిల్లర్ సినిమాలు తీయడంలో ఈ దర్శకుడు మహా ట్యాలెంటెడ్. ఏ ఫిలిం బై అరవింద్ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు కానీ.. ఇప్పుడు కూడా డా. చక్రవర్తి అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతోన్నాడు. అయితే.. టాలీవుడ్ కంటే ముందు.. తర్వాత కూడా అనేక బాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలకు రైటర్ గా పని చేశాడు శేఖర్ సూరి. కానీ.. సినిమాల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంటూ.. సిగరెట్.. మందు.. అమ్మాయిలు లేని వ్యక్తిగా క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ దీన్నే చాలామంది వేరే రకంగా అర్ధం చేసుకుంటూ ఉంటారని చెబుతున్నాడు శేఖర్ సూరి.

ఓసారి షూటింగ్ లో తాను షాట్ చూసుకుంటూ ఉండగా.. ఓ ఇంగ్లీష్ పత్రికకు చెందిన లేడీ ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిందని చెప్పిన శేఖర్ సూరి.. బ్యాగ్ లోంచి సిగరెట్ తీసి వెలిగించి తనకు ఆఫర్ చేసిందని.. వద్దని చెప్పానని.. ఆ తర్వాత డ్రింక్స్ అంటే నో చెప్పానని.. ఆ వెంటనే మీరు ఉమైనైజరా అని అడిగితే ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఇంటర్వ్యూ చేసే విధానం ఇలా ఉంటుందా అని అడిగితే.. సారీ సహజంగా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అంటే ఈ అలవాట్లు ఉంటాయి కదా అని భావించనని చెప్పిందట.

మరో సినిమా షూటింగ్ కోసం ఓ నటిని గెస్ట్ హౌస్ లో ఉండగా.. ఆమెతో మాట్లాడేందుకు అక్కడకి వెళ్లాడట. అప్పటికే డ్రింక్ చేస్తూ.. సిగరెట్ తాగుతున్న ఆమె.. తను గదిలోకి రాగానే గడియ పెట్టిందట. మీ యూనిట్ లో ఉన్న అందరూ నాతో సెక్స్ చేశారు.. నువ్వు తప్ప.. నీకేమైనా ప్రాబ్లెమా అని అడిగిందట ఆ యాక్ట్రెస్. నేను స్టెరైల్ అని భావిస్తున్నావా అంటే.. ఆ ఉద్దేశ్యంతోనే అడిగానని చెప్పిందట. మరెవరితోనో సెక్స్ చేసిన వారితో.. నేను సెక్స్ చేయను అని చెప్పానన్నాడు శేఖర్ సూరి. సినిమాల ఇండస్ట్రీలో కొనసాగడానికి చెడు అలవాట్లేమీ అర్హతలు కావని చెప్పాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.