Begin typing your search above and press return to search.

రెండు చేతులా సంపాదిస్తున్న హీరోయిన్స్‌

By:  Tupaki Desk   |   7 Oct 2021 7:30 AM GMT
రెండు చేతులా సంపాదిస్తున్న హీరోయిన్స్‌
X
ఒకప్పుడు సెలబ్రెటీ అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉండేది అంటూ చాలా మంది అభిప్రాయం. నిజంగా అప్పట్లో అంటే 1960 - 1990 ల్లో చాలా మందికి ఇండస్ట్రీలో మరియు జనాల్లో మంచి పేరున్నా కూడా కనీసం మూడు పూటల తినడానికి ఇబ్బంది పడ్డేవారు. సినిమాల ద్వారా వచ్చే పారితోషికాలు సరిపోక ఇతర పనులు చేసుకున్న వారు కూడా చాలా మంది ఉండే వారు. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒక్కసారి సెలబ్రెటీగా గుర్తింపు వచ్చింది అంటే సినిమాలు వచ్చినా రాకున్నా కూడా ఆ సెలబ్రెటీ స్టేటస్ తో తెలివి ఉంటే చాలా సంపాదించుకోవచ్చు. షాప్‌ ఓపెనింగ్స్ మొదలుకుని సెలబ్రెటీ స్టేటస్ తో చిట్టీలు నడిపే వరకు చాలా పనులు చేస్తూ ఉన్నారు. ఇక హీరోయిన్స్ ఒక్కసారి గుర్తింపు వస్తే ఆదాయం వద్దన్నా వస్తూనే ఉంటుంది.

హీరోయిన్స్ సినిమాలతో సంపాదించేదాని కంటే ఈమద్య కాలంలో ఇన్‌ స్టా గ్రామ్‌.. మోడలింగ్‌.. షాప్‌ ఓపెనింగ్స్‌.. ప్రమోషన్స్‌ ఇతర కమర్షియల్‌ యాడ్స్ లో నటించడం ద్వారా ఎక్కువ ఆదాయంను సంపాదిస్తున్నారు. ఉదాహరణకు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని తీసుకుంటే మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపును దక్కించుకుంది. దాంతో ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇదే సమయంలో సినిమాల కంటే ఎక్కువగా కమర్షియల్స్ మరియు ఓపెనింగ్స్ ద్వారా వస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఆమె ఈమద్య కాలంలో రెగ్యులర్ గా ఏదో ఒక చోట షాప్ ఓపెనింగ్‌ లో కనిపిస్తూనే ఉంది. ఉప్పెన విడుదల అయిన ఏడాది లోపే ఆమె పది నుండి పన్నెండు ఓపెనింగ్స్ కు వెళ్లింది అనేది సోషల్‌ మీడియా టాక్‌. ఓపెనింగ్స్ కు వెళ్లిన సమయంలో ఆమెకు మంచి పారితోషికం దక్కుతుంది అనేది అందరికి తెల్సిందే. అంతే కాకుండా ఆమె ఇన్‌ స్టా గ్రామ్‌ లో కూడా ఆదాయంను కలిగి ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా కమర్షియల్‌ లో కూడా నటిస్తోంది.

ఇలా ఎన్నో రకాలుగా హీరోయిన్స్ సంపాదించుకునే వెసులుబాటు ఇప్పుడు ఉంది. సినిమాల్లో పారితోషికాలు కూడా ఈమద్య కాలంలో కోట్లను మించి వసూళ్లు చేస్తున్నారు. స్టార్‌ హీరోయిన్స్ మల్టీపుల్‌ కోట్లను కూడా దక్కించుకుంటున్నారు అనేది అందరికి తెల్సిన రహస్యం. అమ్మాయిలు సెలబ్రెటీలుగా గుర్తింపు దక్కించుకుంటే చాలు రకరకాల మార్గాల ద్వారా ఆదాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా వారిని సోషల్‌ మీడియాలో జనాలు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. కనుక సోషల్‌ మీడియాలో మంచి ఫొటోలు వీడియోలను షేర్‌ చేయడం ద్వారా ఫాలోవర్స్ ను పెంచుకోవడం.. ఆ తర్వాత ఆదాయం దక్కించుకోవడం చేస్తున్నారు. ఇక కొందరు సాదారణ గుర్తింపు ఉన్న అమ్మాయిలు మరియు హీరోయిన్స్ యూట్యూబ్‌ ఛానెల్‌ లను కూడా నిర్వహిస్తూ మంచి ఆదాయంను దక్కించుకుంటున్నారు. స్టార్ హీరోయిన్స్ నుండి సాదారణ క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ఎన్నో రకాలుగా ఆదాయాలను దక్కించుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. వాటిని సరిగ్గా వినియోగించుకుంటే లక్షల నుండి కోట్ల వరకు ఆదాయాలు రాబట్టుకోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో స్టార్‌ హీరోయిన్స్‌ ఎక్కువ మంది కమర్షియల్‌ యాడ్స్‌ లో నటిస్తున్నారు. వారు నటించే కొన్ని నిమిషాల యాడ్‌ కు కూడా భారీ మొత్తంలో ఛార్జ్‌ చేస్తున్నారు. ఆ యాడ్‌ ఏడాది అంతా కూడా టెలికాస్ట్‌ చేసుకుంటారు కనుక ఏడాది పాటు ఒప్పందం కొనసాగుతూ ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే పారితోషికం ఉంటుంది. హీరోలు ఎక్కువ శాతం పారితోషికాలే వారి ఆదాయ మార్గాలు. కాని హీరోయిన్స్ కు మాత్రం మల్టీపుల్‌ ఉన్నాయి. అందుకే ఈమద్య హీరోయిన్స్ రెండు చేతులు అంతకు మించి ఆదాయం పొందుతున్నారు. ఇది మంచి పరిణామం.