Begin typing your search above and press return to search.

హోటల్ బిల్ కట్టకుండా హీరోయిన్ జంప్!

By:  Tupaki Desk   |   19 March 2019 4:37 PM GMT
హోటల్ బిల్ కట్టకుండా హీరోయిన్ జంప్!
X
ఆమె ఒక ప్రముఖ కన్నడ నటి. కర్ణాటకలో మాత్రమే కాదు.. క్రైమ్ జోనర్ లో తెరకెక్కిన ఒక సినిమా సీరీస్ ద్వారా సౌత్ అంతా రికగ్నిషన్ సాధించింది. బోల్డ్ గా నటించడం.. ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అప్పుడప్పుడూ వివాదాలలో కూడా చిక్కుకుంటూ ఉంటుంది. తాజాగా సదరు భామ అలాంటి ఒక వివాదంలో ఇరుక్కుంది.

రీసెంట్ గా ఆ భామ బెంగుళూరులోని ఒక లగ్జరీ హోటల్ లో కొన్ని రోజులు బస చేసిందట. ఎవరైనా హోటల్ గది ఖాళీ చేసే సమయంలో ఏం చేస్తారు? బిల్ కడతారు కదా.. కానీ ఆ భామ మాత్రం బిల్లు కట్టకుండా హోటల్ స్టాఫ్ కళ్ళుగప్పి ఉడాయించిందట. ఇంతకీ బిల్లు ఎంతనుకున్నారు.. అక్షరాలా నాలుగున్నర లక్షలు. దీంతో సదరు హోటల్ వారు పోలీసులను ఆశ్రయించి ఆ కిలాడి లేడీ పై కేసు నమోదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ భామలు సమన్లు జారీ చేశారట. దీంతో సమస్య పెద్దది అవుతుందని భావించిన ఆ బ్యూటీ వెంటనే రూ. 2 లక్షలను హోటల్ వారికి చెల్లించిందట.. మిగతా రొక్కం వీలైనంత త్వరగా చెల్లిస్తానని కోరడంతో హోటల్ వారు అంగీకరించారట.

దీంతో ఈ న్యూస్ శాండల్ వుడ్ లో గుప్పున పాకింది.. హాట్ టాపిక్ గా మారింది. ఆ భామకు ఆర్ధిక సమస్యలు ఉన్నాయని.. అందుకే ఇలా చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు ఉంటే ఇంట్లో కూర్చోవాలి కానీ స్టార్ హోటల్ కెళ్ళి ఫుల్ గా బిల్ చేస్తే వారెందుకు ఊరుకుంటారు? ఏంటో పెద్ద సెలబ్రిటీలు కూడా ఒక్కోసారి చిన్న లాజిక్ లు మర్చిపోతారు .