Begin typing your search above and press return to search.
కోవిడ్ సోకి హీరోయిన్ కుటుంబం 25 రోజులు ఆస్పత్రిలోనే!
By: Tupaki Desk | 7 Jun 2021 2:30 AM GMTపర్యాటక ఔత్సాహికురాలిగా మారిన కథానాయిక హంసానందిని గడిచిన రెండేళ్లుగా వరుస పోస్టులతో సోషల్ మీడియాల్లో హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న పలు నగరాల నుంచి అడ్వెంచర్ స్పాట్స్ నుంచి వరుస ఫోటోషూట్లను షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
అయితే నెలరోజులుగా హంస నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఖంగు తిన్నారు. హంసకు అసలింతకీ ఏమైంది? అంటూ విచారణ మొదలైంది. వందలాదిగా ట్విట్టర్ ఇన్ స్టా ఫాలోవర్స్ ఇదే విషయాన్ని తనను ప్రశ్నించారట. అయితే తాను తన కుటుంబం 25 రోజుల పాటు కోవిడ్ చికిత్స కోసం ఆస్పత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చిందని ఎట్టకేలకు కోలుకున్నమాని హంసానందిని తెలిపారు.
చికిత్స అనంతరం కోలుకుని తాజాగా ప్లెజెంట్ గా ఉన్న ఓ త్రోబ్యాక్ ఫోటోని హంసానందిని షేర్ చేసారు. ప్రకృతి ద్వారా పెంపకం పొందడానికి.. ప్రకృతిని పెంపొందించుకోండి.. ఈ ప్రపంచ సౌందర్యాన్ని సెలబ్రేట్ చేసుకుందాం..!! అంటూ వ్యాఖ్యను జోడించింది.
కుర్రాళ్లూ క్షమించండి.. గత 30 రోజులు నాకు నా కుటుంబానికి వినాశకరమైనవి. నా ఇన్ బాక్స్ మీ ఆందోళనలతో నిండి ఉంది. నేను అనారోగ్యంగా ఉన్నానేమో అని మీలో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నేను బాగానే ఉన్నాను. ఏప్రిల్ 9 న పాజిటివ్ అని పరీక్షలో తేలింది. తక్షణం నేను నా కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాం.
ఆసుపత్రిలో చేరిన 25 రోజుల తరువాత నా కుటుంబం తిరిగి ఇంటికి వచ్చి కోలుకుంటోందని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇంట్లోనే ఉండి మీ ప్రియమైన వారిని బాగా చూసుకోండి..!! అంటూ వ్యాఖ్యను జోడించింది.