Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ స్టార్ల‌కు హీరోయిన్ క‌ష్టాలు

By:  Tupaki Desk   |   29 April 2022 2:30 AM GMT
సీనియ‌ర్ స్టార్ల‌కు హీరోయిన్ క‌ష్టాలు
X
మామూలుగానే ఇండ‌స్ట్రీలో హీరోయిన్ ల కొర‌త వుంది. దీంతో బాలీవుడ్, సాండ‌ల్ వుడ్, మాలీవుడ్, కోలీవుడ్ నుంచి హీరోయిన్ ల‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయినా కూడా సీనియ‌ర్ స్టార్ల‌కు హీరోయిన్ ల కొర‌త ఏర్ప‌డుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు యంగ్ స్ట‌ర్స్ తో పోటీప‌డుతూ అంగీక‌రిస్తున్నాహీరోయిన్ విష‌యం వ‌చ్చేస‌రికి సీనియ‌న్ స్టార్స్ లాకైపోతున్నారు. త‌మ‌కు త‌గ్గ హీరోయిన్ ల‌భించ‌క స‌త‌మ‌త మ‌వుతున్నారు.

అలా అని యంగ్ హీరోయిన్ ల వెంట‌ప‌డుతున్నారు. కావాల‌నే యంగ్ హీరోయిన్ ల‌ని ఫైన‌ల్ చేసుకుంటున్నారు. అయితే కెమెర‌కా ముందుకు వెళ్లాక స‌దరు యంగ్ హీరోయిన్ లు త‌మ‌కంటే ఇర‌వై ఏళ్లు చిన్న వాళ్లు కావ‌డంతో సీనియ‌ర్ స్టార్స్ ప‌క్క‌న తేలిపోతున్నార‌ట‌. దీంతో స‌ద‌రు కెమెరామెన్ ల‌కు చుక్క‌లు చూపిస్తున్నార‌ట‌. ప్ర‌త్యేకంగా కండీష‌న్ లు పెడుతూ స‌ద‌రు యంగ్ హీరోయిన్ ఫ్రేమ్ లో వున్న స‌మ‌యంలో త‌న‌తో స‌మానంగా త‌మ‌ని కూడా అంతే యంగ్ గా చూపించ‌మ‌ని చెబుతున్నార‌ట‌.

దీంతో స‌ద‌రు కెమెరామెన్స్ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌త్యేక లైటింగ్ తో త‌మ‌ని మ‌రింత యంగ్ గా చూపించాల‌ని కెమెరామెన్ ల‌కు కండీష‌న్ లు పెడుతుండ‌టం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌ల ఓ సీనియ‌ర్ హీరో త‌న‌కు త‌గ్గ హీరోయిన్ ల‌భించ‌క‌పోవ‌డంతో త‌న‌కంటే ఇర‌వై ఏళ్లు చిన్న‌దైన యంగ్ బ్యూటీ ని త‌న సినిమాలో ఫైన‌ల్ చేసుకున్నారు. ఇటీవ‌లే స‌ద‌రు సీనియ‌ర్ హీరో సినిమా ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

ర‌షెస్ చూసుకున్న త‌రువాత స‌ద‌రు సీనియ‌ర్ హీరో కెమెరామెన్ కు ప‌లు సూచ‌న‌లు చేశార‌ట‌. త‌న కంటే 20 ఏళ్లు చిన్న‌దైన హీరోయిన్ ఫ్రేమ్ లో వున్న‌ప్పుడు త‌న‌తో పాటు త‌న‌ని కూడా యంగ్ చూపించ‌డానికి ప్ర‌త్యేక లైటింగ్ ని యూజ్ చేయ‌మ‌ని చెబుతున్నార‌ట‌. అంతే కాకుండా త‌న ప‌క్క‌న చేసే ప్ర‌తీ సీన్ లోనూ తాను యువ‌కుడిలా త‌న‌కు త‌గ్గ వాడిలా క‌నిపించాల‌ని, ఆ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోమ‌ని కెమెరామెన్ కు సూచ‌న‌లిస్తున్నార‌ట‌.

ఇది గ‌మ‌నించిన వారంతా స‌ద‌రు సీనియ‌ర్ హీరో తాను యంగ్ గా క‌నిపించాల‌ని తాప‌త్ర‌య ప‌డ‌టంలో త‌ప్పులేద‌ని, అయితే ఆ క్ర‌మంలో త‌న‌కంటే ఇర‌వై ఏళ్లు చిన్న‌దైన హీరోయిన్ తో స‌మానంగా త‌న‌ని చూపించ‌మ‌ని అడ‌గ‌డం మాత్రం బాగాలేద‌ని కామెంట్ లు చేస్తున్నార‌ట‌. దీనికంటే క‌నీసం ఏజ్ గ్యాప్ క‌నిపించ‌ని హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకుని వుంటే మ‌రింత‌గా బాగుండేద‌ని, సీనియ‌ర్ హీరోలు ఆ విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయ‌ట‌.