Begin typing your search above and press return to search.
హీరోయిన్ ఇంద్రజ లవ్ స్టోరీః మతాలు వేరు.. మనసు ఒక్కటే!
By: Tupaki Desk | 24 April 2021 2:38 AM GMTఆకలికి కులం, మతం, ప్రాంతం అనే బేధాలు ఉంటాయా? మనసుకు కూడా అంతే.. ఎవరిని, ఎప్పుడు ఇష్టపడుతుందో తెలియదు. నచ్చకపోతే ఒంటిమీద దుస్తులు వేసుకోవడానికి మనసు అంగీకరించదు. అలాంటిది.. నచ్చని మనిషితో జీవితం పంచుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఈ విషయాలను చాలా మంది ఆలోచించరు.
మతాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో మనసుకు బంధనాలు వేస్తుంటారు. ఇవన్నీ ఎదురయ్యే అవకాశం ఉన్న ప్రేమ పెళ్లి చేసుకున్నారు నాటి హీరోయిన్ ఇంద్రజ. చాలా మందికి తెలియని తన ప్రేమకథను తాజాగా వినిపించారు.
ఆమె తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె భర్త ఒక ముస్లిం. వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లికి ముందు వీళ్లు ఆరు సంవత్సరాలపాటు స్నేహితులు. ఆ తర్వాతే వీరిమధ్య ప్రేమ చిగురించింది. అభిప్రాయాలు పంచుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాతే పెళ్లి చేసుకున్నారు.
మతం అడ్డురాలేదా? అన్న ప్రశ్నకు.. చాలా గొప్ప సమాధానం చెప్పారు ఇంద్రజ. ''ఇష్టం అనేది మతం, కులం చూసి కలగదుకదా..? మతానికి, మనసుకు నచ్చడానికి సంబంధం లేదు'' అన్నారు. ''తను నాకు అండగా ఉంటాడని నమ్మాను, ఆయన కూడా అంతే.. అందుకే పెళ్లి చేసుకున్నాం'' అని చెప్పారు.
ఇక, తన భర్తకు సైతం ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆయన ఒక రచయిత అని, పలు సీరియల్స్ లో కూడా నటించారు తెలిపారు. అంతేకాకుండా.. ఆయన యాడ్ ఫిల్మ్ మేకర్ అని కూడా చెప్పారు. తన అత్తగారికి బిజినెస్ ఉందని చెప్పారు ఇంద్రజ.తనకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ భర్త ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందని చెప్పిన ఆమె.. ఎక్కడా తనకు లిమిట్స్ పెట్టరని చెప్పారు. ఆయన సపోర్టుతోనే ముందుకు సాగుతుంటానని తెలిపారు.