Begin typing your search above and press return to search.

లవ్‌ ఫెయిల్యూర్ తో డిప్రెషన్‌ లోకి హీరోయిన్‌

By:  Tupaki Desk   |   5 Dec 2021 12:30 AM GMT
లవ్‌ ఫెయిల్యూర్ తో డిప్రెషన్‌ లోకి హీరోయిన్‌
X
సినిమా ఇండస్ట్రీలో ఆన్ స్క్రీన్ లవ్‌ స్టోరీలు మాత్రమే కాకుండా ఆఫ్‌ స్క్రీన్‌ లవ్‌ స్టోరీలు కూడా ఉంటాయి. రియల్‌ లైఫ్ లవ్‌ స్టోరీలు ప్రస్తుతం చాలా చాలా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రేమలో ఉన్నారు. బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన వారు ప్రేమలో పడటం ఎంత కామన్‌ గా జరుగుతుందో.. బ్రేకప్‌ అవ్వడం కూడా అంతే ఈజీగా కామన్ గా జరుగుతుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కొందరు బ్రేకప్ ను తేలికగా తీసుకుంటే మరి కొందరు మాత్రం సీరియస్ గా తీసుకుని డిప్రెషన్ లోకి వెళ్లి పోవడం చివరకు ఆత్మహత్యకు కూడా పాల్పడటం జరుగుతుంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు లవ్‌ పెయిల్యూర్ తో తనువు చాలించిన సందర్బాలు ఉన్నాయి. కొందరు మాత్రం ధైర్యంగా పోరాడిన సందర్బాలు కూడా ఉన్నాయి.

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్ నటించిన దంగల్ సినిమా లో నటించిన సన్యా మల్హోత్రా లవ్ ఫెయిల్యూర్ అంటూ చెప్పుకొచ్చింది. ఆ సినిమా లో అమీర్ ఖాన్ కు కూతురు పాత్రలో నటించి మెప్పించింది.

ఆ సినిమాలో చిన్న అమ్మాయిగా కనిపించిన సన్యా మల్హోత్రా ఇప్పుడు సోషల్‌ మీడియాలో మరియు వెండి తెరపై తన అందాలతో ఆకట్టుకుంటున్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం చాలా యాక్టివ్‌ గా ఉన్న ఈ అమ్మడు కొన్నాళ్ల క్రితం డిప్రెషన్‌ లోకి వెళ్లి పోయి ఆత్మహత్య చేసుకోవాలన్నంత డిస్ట్రబ్‌ అయ్యిందట. అందుకు కారణం లవ్‌ ఫెయిల్యూర్ అంటూ చెప్పుకొచ్చింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ అమ్మడు మాట్లాడుతూ.. తాను ఢిల్లీలో ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయితో నాలుగు సంవత్సరాల పాటు రిలేషన్ లో ఉన్నాను. అతడి పట్ల పూర్తి నమ్మకంతో జీవనం సాగించాను. అతడే జీవితం అన్నట్లుగా భావించాను. కాని అతడు నా నుండి దూరం అయ్యాడు.

కారణం ఏదైనా అతడు నాతో బ్రేకప్‌ అవ్వడంతో జీవితం మొత్తం శూన్యం అయినట్లుగా అనిపించింది. బ్రేకప్‌ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లాను. ఆ సమయంలో స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల వల్లే మళ్లీ నేను నార్మల్‌ అయ్యాను. బ్రేకప్‌ బాధ కలిగిస్తుంది కాని దాన్ని మనం జయించాల్సిన అవసరం ఉంది.

మనని కాదనుకున్న వారిని గురించి ఎక్కవగా ఆలోచించి సమయం వృదా చేసుకోవద్దు. ప్రేమ అనేది సెల్ఫ్‌ లవ్‌ కంటే ముఖ్యం కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలంటూ సన్యా మల్హోత్రా తన అనుభవంను చెప్పుకొచ్చింది.