Begin typing your search above and press return to search.
కాజల్ ఇంకా టీనేజర్ అనుకుంటుందా.. ఏంటా టీజింగు?
By: Tupaki Desk | 12 Aug 2021 4:23 AM GMTచందమామ కాజల్ అగర్వాల్ బిజినెస్ మేన్ కం ఫ్రెండు గౌతమ్ కిచ్లుని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 30 న ముంబైలో కొద్దిమంది కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో తన సఖుడిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తరవాతా భర్త సహకారంతో సినీనాయికగా కెరీర్ పరంగా బిజీ అయ్యారు. మరోవైపు తన భర్త వ్యాపారాలకు ప్రచారకర్తగానూ కాజల్ కొనసాగుతున్నారు.
పెళ్లి తర్వాత ఈ బ్యూటీ నటించిన ముంబై సాగా- మోసగాళ్లు చిత్రాలు రిలీజయ్యాయి. ఆచార్య రిలీజ్ కి రానుంది. హే సినామిక- పారిస్ పారిస్-కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రీకరణ దశలో ఉన్నాయి. పారిస్ పారిస్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ గా రికార్డులకెక్కింది.
ఏడాది వైవాహిక జీవితాన్ని కాజల్ అగర్వాల్ ఎంతో ఆస్వాధించింది. బుధవారం నాడు తన ఫస్ట్ టీజ్ వేడుకల నుంచి కొన్ని ఫోటోలను పంచుకుంది. వర్షాకాల పండుగ కోసం పండుగ దుస్తుల్లో తళుక్కున మెరిసింది. అనితా డోంగ్రే అల్మారాల నుండి ప్రింటెడ్ గ్రీన్ కుర్తా కాజల్ కోసమే డిజైన్ చేశారా? అన్నంత అందంగా సెట్టయ్యింది. అందమైన డిజైనర్ నగలతో గులాబీ వర్ణం హెయిర్ తో కాజల్ ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది.
ఈ వేడుకల్లో కాజల్ అత్త గారు .. మదర్ తదితరులు ఉన్నారు. తన అందమైన మెహందీ డిజైన్ ఫోటోలను పంచుకుంది. తన కుటుంబ సభ్యులతో ఎంతో చిల్లింగ్ గా సంతోషంగా కనిపించింది. కాజల్ తాజా పోస్ట్ కు #ఫస్ట్‌టీజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అభిమానుల్లో వైరల్ గా మారింది. ఆసక్తికరంగా పెళ్లి తర్వాత కాజల్ ఆనందం పదింతలైందని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. అందాల చందమామలో గ్లో ఇప్పుడు వంద రెట్లు పెరిగింది.