Begin typing your search above and press return to search.

అర్థరాత్రి రూమ్‌ కు వచ్చి.. డైరెక్టర్ పై హీరోయిన్‌ పోలీసు కేసు

By:  Tupaki Desk   |   1 Oct 2021 9:30 AM GMT
అర్థరాత్రి రూమ్‌ కు వచ్చి.. డైరెక్టర్ పై హీరోయిన్‌ పోలీసు కేసు
X
హీరోయిన్‌ లు గతంలో కాస్టింగ్ కౌచ్ లేదా లైంగిక వేదింపులు ఎక్కువగా ఎదుర్కొనేవారు. అయితే ఇప్పుడు మీటూ వచ్చిన తర్వాత సోసల్‌ మీడియా ద్వారా కూడా హీరోయిన్స్ తమను ఇబ్బంది పెట్టిన వారిపై స్పందిస్తున్న నేపథ్యంలో చాలా మంది భయపడుతున్నారు. కాని కొందరు మాత్రం ఏమాత్రం భయం లేకుండా హీరోయిన్స్ ను కూడా లైగింక వేదింపులకు గురి చేయడంతో పాటు అత్యంత నీచంగా ప్రవర్తిస్తూ తమతో గడపమని బలవంతం చేస్తున్నారు. ఇటీవల తమిళ సినిమా పరిశ్రమలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. హీరోయిన్ నేహా సక్సేనా తమిళంలో ఒక సినిమాను చేసింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను ఒక ఆంగ్ల మీడియా సంస్థకు వెళ్లడించింది. చిత్ర దర్శకుడు మరియు నిర్మాతలు వ్యవహరించిన తీరుతో తాను చనిపోతాను అనే భయం కలిగింది అంటూ నేహా చెప్పుకొచ్చింది. దర్శకుడు చిత్రీకరన సమయంలో పలు సార్లు ఫిజికల్‌ గా నాపై దాడి చేశాడు. షూటింగ్ జరిగినన్ని రోజులు ఏదో ఒక విషయంలో నాతో ఆయన అసభ్యంగా మాట్లాడుతూనే ఉండేవాడు. షూటింగ్‌ ప్రారంభం అయిన రోజే నాపై దాడి చేశారు. నాకు మొదట చెప్పిన స్క్రిప్ట్‌ కాకుండా మరో స్క్రిప్ట్‌ తో సినిమాను చేయడం జరిగింది.

నాకు కేటాయించిన హోటల్‌ లో కూడా పదే పదే నాపై భౌతిక దాడి జరిగింది. నా అసిస్టెంట్స్ లేని సమయంలో అర్థరాత్రి సమయంలో హోటల్‌ ఓనర్ వచ్చి డోర్‌ కట్టాడు. ఆ సమయంలో నాతో ఆయన అసభ్యంగా మాట్లాడాడు. ఆ రాత్రి నాతో నా స్నేహితులతో కలిసి పడుకోవాలంటూ ఆయన నన్ను బెదిరించాడు. నాతో ఆయన వ్యవహరించిన తీరుతో ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఆ సమయంలో దర్శకుడికి ఫోన్ చేస్తే చాలా లైట్‌ అన్నట్లుగా మాట్లాడాడు. ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు అంటూ ఎద్దేవ చేసినట్లుగా మాట్లాడాడు. మొత్తంగా నన్ను అతడు అత్యంత నీచంగా మాట్లాడాడు అంటూ హీరోయిన్ చెప్పుకొచ్చింది. షూటింగ్‌ సమయంలో పలు సందర్బాల్లో నన్ను అందరి ముందు తిట్టడంతో పాటు నన్ను చాలా హేలనగా మాట్లాడుతూ ఉండేవాడు. మొత్తంగా నన్ను అత్యంత దారుణంగా హింసించాడు అంటూ పేర్కొంది.

చిత్ర దర్శకుడి కొడుకు ఆ సినిమాలో హీరో. అతడు షూటింగ్‌ సమయంలో నాపై భౌతిక దాడి చేశాడు. షూటింగ్‌ చివరి రోజు నా గొంతు పిసికి చంపే ప్రయత్నం చేశాడు. నన్ను మెట్ల మీద నుండి కిందకు తోశాడు. సినిమా చిత్రీకరన మద్యలో ఏమైనా తేడా జరిగితే నిర్మాతకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. వారు నిన్ను ఏమైనా చేస్తారు అంటూ హెచ్చరించారు. మొత్తానికి ఆ తమిళ సినిమాలో నటిస్తున్న అన్ని రోజులు కూడా అత్యంత బాధకరమైన రోజులు గడిపాను అంటూ హీరోయిన్ చెప్పుకొచ్చింది. నా పదేళ్ల సినీ కెరీర్ లో అలాంటి ఇబ్బందులు ఎప్పుడు ఎదురు కాలేదు అంది. తనపై జరిగిన భౌతిక దాడి మరియు లైంగిక వేదింపులకు సంబంధించి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పుకొచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే దర్శకుడు మరియు ఇతర యూనిట్‌ సభ్యులు ఇంకా హోటల్‌ ఓనర్ ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. నేహా సక్సేనా పై లైంగిక దాడి మరియు ఫిజికల్‌ దాడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో ఆమె కు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. కఠినంగా వారిని శిక్షించాల్సిందే అంటూ సోషల్‌ మీడియా ద్వారా ఆమెను సమర్థిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.