Begin typing your search above and press return to search.
హీరోయిన్ బ్లాక్ మెయిల్ చేసిన ఆకతాయిల అరెస్ట్
By: Tupaki Desk | 25 Jun 2020 11:10 AM GMTతెలుగు ప్రేక్షకులు సుపరిచితం అయిన హీరోయిన్ పూర్ణను గత కొన్ని రోజులుగా కొందరు వరుసగా ఫోన్ లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారట. మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. షూటింగ్స్ లేకపోవడంతో గత మూడు నెలల కాలంగా తన సొంత ప్రాంతం అయిన కేరళలో ఉంటున్న పూర్ణకు వరుసగా కాల్స్ వస్తున్నాయట. మొదట వాటిని పట్టించుకోని పూర్ణ ఆ తర్వాత కాల్స్ మరియు మెసేజ్ లు మరింత ఎక్కువ అవ్వడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందట.
పూర్ణ ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ఆధారంగా ఎంక్వౌరీ చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. అష్రఫ్.. రఫీఖ్.. శరత్.. రమేష్ అనే ఈ నలుగురు గత కొంత కాలంగా ప్రముఖులకు డబ్బున్న వారికి ఫోన్ లు చేసి బెదిరించి ఏదో ఒక విషయంలో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు లాగుతూ ఉన్నారట. తాజాగా పూర్ణ పోలీసుల వద్దకు వెళ్లడంతో వీరి గుట్టు రట్టయ్యింది. ఈ నలుగురిని అరెస్ట్ చేసి పోలీసులు కోర్టు ముందు ప్రవేశ పెట్టగా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది.
హీరోయిన్ గా ఈ మద్య కాలంలో ఆఫర్లు లేకున్నా బుల్లి తెరపై ఒక డాన్స్ షో లో జడ్జ్ గా అలరిస్తున్న పూర్ణ మలయాళ సినిమాల్లో ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో ఈమె హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసేందుకు ఆసక్తిగా ఉందట. హర్రర్ సినిమాల్లో ఎక్కువగా నటించిన పూర్ణ కు ఆ తరహా ఇమేజ్ పడిపోయింది. దాంతో కమర్షియల్ పాత్రలు తగ్గాయి అనేది కొందరి వాదన.