Begin typing your search above and press return to search.
హీరోయిన్స్ సర్జరీలపై బోల్డ్ హీరోయిన్ కామెంట్స్
By: Tupaki Desk | 20 Oct 2021 6:30 AM GMTబాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ అన్ని వుడ్స్ లో ఉన్న హీరోయిన్స్ లో ఎక్కువ శాతం మంది తమ అందాన్ని పెంచుకోవడం కోసం ఏదో ఒక సందర్బంలో చిన్న చిన్న సర్జరీలు అయినా చేయించుకుని ఉంటారు. సర్జరీలతో అందాన్ని పెంచుకున్న హీరోయిన్స్ జాబితా చాలా పెద్దగా ఉంటుంది. చాలా మంది హీరోయిన్స్ కనీసం తమ సర్జరీలకు సంబంధించిన విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడితే కొందరు మాత్రం మొహమాటం లేకుండా ఔను తాము సర్జరీ చేయించుకున్నాం అంటూ వ్యాఖ్యలు చేసిన వారు ఉన్నారు. సర్జరీలు చేయించుకుని అందంగా తయారు అయ్యి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. బాలీవుడ్ లో ఆ జాబిత చాలా పెద్దగానే ఉంటుంది అనడంలో సందేహం లేదు.
తాజాగా ఆపరేషన్ లు చేయించుకుని అందంగా తయారు అయిన హీరోయిన్స్ గురించి బోల్డ్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న రాధిక ఆప్టే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈమద్య కాలంలో చాలా మంది మేకప్ లేకుండా ఫొటో అని.. నో ఫిల్టర్ ఫొటోలు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాని ఎవరైతే సర్జరీ చేయించుకోని వారు ఉన్నారు వారు ధైర్యంగా ముందుకు వచ్చి తమ ఫొటోలను షేర్ చేయాలని చెప్పుకొచ్చింది. నో ఫిల్టర్.. నో మేకప్ ఫొటోలు కాదు సహజ సౌందర్యంను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయాంటూ రాధిక ఆప్టే ఛాలెంజ్ విసిరింది. ఎవరైతే ఆపరేషన్ చేయించుకోలేదో వారు నాచురల్ బ్యూటీ అంటూ సోషల్ మీడియాలో తన పిక్ ను షేర్ చేయాలంటూ ఆమె సూచించింది.
ఆపరేషన్ లు చేయించుకుని అందాన్ని పెంచుకుంటే ప్రత్యేక ఏముందని.. సహజంగా అందంగా కనిపించిన వారే అసలైన అందగత్తెలు అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆపరేషన్ ల వల్ల అందం పెంచుకోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని రాధిక చెప్పుకొచ్చింది. ఆపరేషన్ లు చేయించుకుని అందం పెంచుకున్న హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని.. వారిలో చాలా మంది తమ విషయం మీడియాకు కూడా చెప్పేందుకు ఆసక్తిగా లేరంటూ రాధిక అభిప్రాయం వ్యక్తం చేసింది. హీరోయిన్ గా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ బిజీ బిజీగా నటించేస్తున్న రాధిక ఆప్టే తనను తాను సహజమైన బ్యూటీగా చెప్పుకుంది. అయితే రాధిక మరింత అందంగా తయారు అవ్వడం కోసం మొహం పై సర్జరీ చేయించుకోవాలని గతంలో కొందరు సూచించారట. కాని ఆమె మాత్రం సహజంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో ఆపరేషన్ కు వెళ్లలేదు.