Begin typing your search above and press return to search.
షో నిర్వాహకులపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన స్టార్ హీరోయిన్..?
By: Tupaki Desk | 17 Nov 2021 4:09 AM GMTస్టార్ హీరోయిన్ తమన్నా భాటియా 'మాస్టర్ చెఫ్' అనే తెలుగు ఫుడ్ షో ద్వారా టీవీ రంగంలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా పాపులర్ అయిన ఈ షో.. తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. జెమినీ టీవీలో ప్రసారమైన ఈ షో కనీస టీఆర్పీ రేటింగ్ లను పొందడంలో విఫలమైంది.
అయితే కొన్ని ఎపిసోడ్స్ అయ్యాకా తమన్నా ప్లేస్ లో యాంకర్ అనుసూయ హోస్టుగా ప్రత్యక్షమైంది. తనకు రావాల్సిన అమౌంట్ ను క్లియర్ చేయకపోవడం మరియు నిర్వాహకులు ప్రొఫెషనలిజంతో వ్యవహరించలేదనే కారణాలతో తమన్నా ఈ షో నుండి వైదొలిగింది.
అయితే తమన్నా రెండు రోజులు షూటింగ్ కు రాకుండా తమకు రూ.5 కోట్ల మేర నష్టం కలిగించిందని ఆరోపిస్తూ మాస్టర్ చెఫ్ యాజమాన్యం ప్రెస్ నోట్ విడుదల చేసింది. దీని మీద తమన్నా ఇప్పుడు షో నిర్వాహకులైన ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ (IFA)పై చట్టపరమైన చర్యలకు సిద్ధపడిందని వార్తలు వస్తున్నాయి.
తన గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా తన ఇమేజ్ ను కించపరిచినందుకు వారిపై చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్న తమన్నా.. ఇప్పటికే తన లీగల్ టీమ్ తో కలిసి చర్యలు ప్రారంభించిందట.
'మాస్టర్ చెఫ్' నిర్వాహకుల ప్రెస్ నోట్ లో ''ఈ ప్రోగ్రామ్ కోసం తమన్నాతో రూ. 2 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నాం. జూన్ 24 నుంచి సెప్టెంబర్ చివరి వరకు మొత్తం 18 రోజులు షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు అగ్రిమెంట్ చేసుకోగా తమన్నా 16 రోజులు మాత్రమే షూటింగ్ కి హాజరయ్యారు.
మిగతా రెండు రోజులు ఆమె రాకపోవడంతో 300 వందల మంది టెక్నీషియన్లు పనిచేస్తున్న షోకి రూ.5 కోట్లకు పైగా నష్టం వచ్చింది. ఇప్పటికే తమన్నాకు రూ. 1.56 కోట్లు చెల్లించడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ రెండు రోజులు ఆమె షూటింగ్ రాకపోవడంతో చెల్లించలేదు'' అని పేర్కొన్నారు.
తమన్నా లీగల్ టీమ్ మాత్రం ఆమెకు చెల్లింపులు ఇంకా క్లియర్ చేయలేదని.. ఆమెతో కమ్యూనికేషన్ ను నిలిపివేసారని.. ఆమెకు వ్యతిరేకంగా కల్పిత కథలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోడానికి రెడీ అయ్యారని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.
ఇక సినిమాల విషయానికొస్తే.. తమన్నా భాటియా ప్రస్తుతం వెంకటేష్ తో 'ఎఫ్ 3'.. సత్యదేవ్ తో 'గుర్తుందా శీతాకాలం' వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇదే క్రమంలో లేటెస్టుగా చిరంజీవి సరసన 'భోలా శంకర్' చిత్రంలో హీరోయిన్ గా చేయడానికి రెడీ అయింది.