Begin typing your search above and press return to search.
దివంగత స్టార్ హీరోను గుర్తుచేసుకున్న హీరోయిన్..!
By: Tupaki Desk | 30 April 2021 10:55 AM GMTగతేడాది జూన్ నెలలో కన్నడ హీరో చిరంజీవి సార్జా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అసలే ఓవైపు కరోనాతో దేశం అల్లకల్లోలం అవుతుంటే మరోవైపు అభిమాన సినీతారల గురించి మరణవార్తలు వింటూ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అయితే దివంగత సినీనటుడు చిరంజీవి సార్జా భార్య మేఘనా రాజ్ ఇంకా తన భర్త గురించి తలచుకుంటూనే ఉంది. భర్తను కోల్పోయి ఏడాది కావస్తుంది అంటేనే ఆమె నమ్మలేకపోతుంది. భర్త చనిపోయిన నాలుగు నెలలకే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మేఘనా.. ప్రస్తుతం కొడుకునే భర్త జ్ఞాపకాలతో ప్రేమగా అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. అయితే తాజాగా మేఘనా తన భర్త చిరంజీవిని మరోసారి గుర్తుచేసుకుంది.
చిరంజీవి - మేఘనా 2018లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అంగారా అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ప్రేమించుకొని తల్లిదండ్రులను ఒప్పించి ఒక్కటయ్యారు. కానీ పెళ్ళైన రెండేళ్లకే మేఘనా భర్తను కోల్పోయింది. అయితే ఇప్పటికే భర్తను తలచుకుంటూ వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, హ్యాపీ మూమెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. తాజాగా మేఘనా.. తన భర్తతో ఈఫిల్ టవర్ దగ్గర దిగిన హ్యాపీ పిక్ ఒకటి షేర్ చేసింది. అలాగే 'త్వరగా తిరిగిరా.. లవ్ యూ' అంటూ తన ప్రేమను వెల్లడించింది. ఫోటోలో చిరంజీవి - మేఘనా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎలాగో ఆయన తిరిగిరాడు కాబట్టి ఫ్యాన్స్ కూడా మేఘనాను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే మళ్లీ సినిమాలు చేస్తానని ఇటీవలే ప్రకటించింది మేఘనా. చూడాలి మరి సినిమాలతో అయినా హ్యాపీగా ఉంటుందేమో!