Begin typing your search above and press return to search.
ఐటీ దాడుల్లో రూ.5 కోట్ల రషీదు పై స్పందించిన హీరోయిన్
By: Tupaki Desk | 9 March 2021 12:30 AM GMTసౌత్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి బాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారిన తాప్సి ఇంటి పై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. ఆమెకు మరియు ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తుల లెక్కలను ఐటీ వారు ఎంక్వౌరీ చేశారట. ఐటీ ఎంక్వౌరీ వార్తలతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తాప్సి ఇంట్లో భారీ సొత్తు బయట పడింది అంటూ ప్రచారం జరుగుతోంది. తాప్సి వద్ద రూ.5 కోట్లకు సంబంధించిన ఒక రసీదు లభించిందని ఆ రసీదు విషయమై ఐటీ వారు అడిగిన ప్రశ్నలకు తాప్సి సమాధానం చెప్పలేదంటూ ప్రచారం జరుగుతోంది.
మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తాప్సి స్పందించింది. తన ఇంట్లో మరియు ఆఫీస్ లో ఐటీ దాడులు జరిగిన విషయం నిజమే కాని ఇప్పటి మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఆ రూ.5 కోట్లు ఎవరు ఇచ్చారో.. ఐటీ వారు ఏమన్నారో తనకు తెలిదు అంటూ ఇండైరెక్ట్ గా అవి పుకార్లే అంటూ తేల్చి చెప్పింది. నేను నా కుటుంబ సభ్యులు ఐటీ అధికారులు ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం ఇచ్చాము. వారు అన్నింటికి కూడా సంతృప్తి చెందారంటూ తాప్సి పేర్కొంది. తాప్సి పై ఐటీ దాడుల విషయమై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. జనరల్ ప్రొసీజర్ లో మాత్రమే ఆమె పై ఐటీ దాడులు జరిగాయి. 2013 లో కూడా తాప్సి పై ఐటీ దాడులు జరిగాయి. అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించింది.