Begin typing your search above and press return to search.
పూర్ణ పేరు వెనక పెద్ద సీక్రెట్
By: Tupaki Desk | 26 Nov 2016 1:30 AM GMTజయమ్ము నిశ్చయమ్మురా మూవీతో ఇవాళ ప్రేక్షకులను పలకరిస్తోంది హీరోయిన్ పూర్ణ. టాలీవుడ్ కి సంబంధించినంత వరకూ ఈమెను హారర్ క్వీన్ అని పిలిచేస్తుంటారు సినీ జనాలు. అవును.. రాజుగారి గది లాంటి హిట్టు హారర్ మూవీస్ ఈమె ఖాతాలో ఉండడంతో.. అలాంటి పేరు వచ్చింది. తొలిసారి దేశీ కామెడీ అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది పూర్ణ.
ఈ పూర్ణ అసలు పేరు అది కాదు. ఈ బ్యూటీ ఒరిజినల్ నేమ్ షామ్నా కాసిం. మరి పేరెందుకు మార్చుకున్నట్లో?? 'తమిళ్ సినిమాల్లో అరంగేట్రం చేసినపుడు అక్కడ అంతా నా పేరు సరిగా పలికేవారు కాదు. అందుకే సింపుల్ గా ఉన్న పేరు కోసం వెతికాను. ఆ సమయంలో నా మేనేజర్ కు ఓ చిన్ని కూతురు ఉండేది. ఆమె పేరు పూర్ణ. నాకు ఆ పేరు నచ్చేయడంతో అప్పటి నుంచి పూర్ణగా మారిపోయాను. అలా పూర్ణగా పేరు మార్చుకున్నాక నాకు చాలా కలిసొచ్చింది. న్యూమరాలజీలో కూడా చెక్ చేసుకున్నాను' అంటోంది షామ్నా కాసిం అలియాస్ పూర్ణ.
ఇలా పేర్లు మార్చుకున్న హీరోయిన్లు మనకు చాలామందే తగులుతారు. సుజాత అసలు పేరు జయసుధ.. జయప్రద అసలు పేరు లలితా రాణి. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మయంగార్ అయ్యప్పన్.. రంభ అసలు పేరు విజయలక్ష్మి.. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. టబూ అసలు పేరు తబుస్సమ్ హష్మీ కాగా.. సౌమ్య పేరు సౌందర్యగాను.. స్వీటీ అనుష్కగాను.. డయానా కురియన్ నయనతారగానూ పేర్లు మార్చుకుని హీరోయిన్లుగా చెలామణీ అయిపోయారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/