Begin typing your search above and press return to search.
హీరోయిన్ పెళ్లికి కెరీర్ రెయిన్ చెక్?!
By: Tupaki Desk | 2 March 2019 5:30 PM GMTటాలీవుడ్ లో ఓ అగ్ర కథానాయిక వ్యక్తిగత లైఫ్ స్టైల్ గురించి ప్రముఖంగా చర్చ సాగుతుంటుంది. ఇండస్ట్రీలో దశాబ్ధం పైగానే అద్భుతమైన చిత్రాల్లో నటించిన సదరు కథానాయిక ప్రస్తుతం తెలుగు - తమిళంలో బిజీ నాయిక. హిందీలోనూ అడపాదడపా అవకాశాలొస్తే నటిస్తుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సరైన ఛాన్సులు లేవు కానీ - కాంటాక్ట్స్ పరంగా ఇబ్బందేం లేదు. కిలాడీ అక్షయ్ అంతటి స్టార్ హీరో నుంచి రిఫరెన్స్ ఉంది తనకు. ముంబై టు హైదరాబాద్ .. హైదరాబాద్ టు చెన్నయ్ తనకు అద్భుతమైన కాంటాక్ట్స్ ఉన్నాయి. పీఆర్ సపోర్ట్ ఉంది.
అయితే సదరు కథానాయిక గత కొంతకాలంగా పెళ్లి విషయంలో ఎందుకనో విముఖతగా ఉండడం మరోసారి యూత్ లో చర్చకు వచ్చింది. అసలెందుకిలా జరుగుతోంది? ఇటీవలి కాలంలో పలువురు అగ్ర కథానాయికలు పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితాల్లో స్థిరపడిపోయారు. పెళ్లయ్యాక కెరీర్ పరంగా ఇబ్బంది లేకుండా నటించేస్తున్నారు. అందులో సమంత - శ్రీయ - అనుష్క శర్మ - దీపిక పదుకొనే - నేహా ధూపియా వంటి పేర్లు జాబితాలో ఉన్నాయి. అయితే వీళ్ల తరహాలోనే సదరు కథానాయిక కూడా పెళ్లి తో స్థిరపడి కెరీర్ ని సాగించవచ్చు కదా! 30 ప్లస్ లోనూ తోడు లేకుండా ఈ అగచాట్లు ఎందుకు? అంటూ ముచ్చటా సాగుతోంది.
పైగా అప్పట్లో ఈ బ్యూటీ ముంబైకి చెందిన ఓ బిజినెస్ మేన్ తో డేటింగ్ లో ఉందని, తొందర్లోనే పెళ్లాడేయబోతోందని ప్రచారమైంది. ఇక రేపో మాపో పెళ్లి! అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు వండి వార్చడంతో అది సౌత్ లోనూ ప్రముఖంగా చర్చకొచ్చింది. ఇంతలోనే ఏమైందో.. ఆ అందాల భామ మనసు మార్చుకున్నట్టే కనిపిస్తోంది. పెళ్లి వార్తలు అసత్య ప్రచారం! అంటూ చిరాకులు పరాకులు ప్రదర్శించిందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కెరీర్ పైనే దృష్టి సారించడం ఆసక్తికరం. అటుపై ఇటీవల ఓ యువహీరోతో లవ్ లో ఉంది అంటూ సాగిన ప్రచారానికి తాజాగా చెక్ పడింది. ప్రస్తుతం ఓ రెండు సినిమాల్లో నటిస్తోంది. కేవలం సినమాల్లో నటించడం... సామాజిక సేవల్లో తలమునకలుగా ఉండడం.. ఇదొక్కటే తన వ్యాపకం. పెళ్లిని మించి కెరీర్ ని ప్రేమించడం.. సేవల్లోనే ఆనందం వెతుక్కోవడం అన్న ఫార్ములాని అనుసరించడం చర్చకొస్తోంది. మరోవైపు `పెళ్లి` పేరుతో కెరీర్ ని వదులుకోవడం ఇష్టం లేకనే సదరు బిజినెస్ మేన్ తో సీక్రెట్ ఎఫైర్ సాగిస్తూ దానిని అలానే మెయింటెయిన్ చేస్తోందన్న వాదనా వినిపిస్తోంది.