Begin typing your search above and press return to search.

మంత్ర‌గ‌త్తెవు నీవు.. డూడుల్ మాయ‌లోడు ఆయ‌న‌..!

By:  Tupaki Desk   |   7 Aug 2021 5:39 AM GMT
మంత్ర‌గ‌త్తెవు నీవు.. డూడుల్ మాయ‌లోడు ఆయ‌న‌..!
X
నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా.. కాప‌ర్చీనో కాఫీయా సోఫియా....ఓ రెమో ఓరెమో చేయ‌రా నేర‌మో ఘోర‌మో.. ! అప‌రిచితుడు`లోని లిరిక‌ల్ సాంగ్ లా నువ్వు నేను ఒకే కోక్ లో.. రెండు స్ట్రాలు వేద్దాం! అంటూ శ్రుతిహాస‌న్ - డూడుల్ ఆర్టిస్ట్ శంత‌ను హ‌జారిక ఎంతో స్నేహంగా ఉన్నారు. ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండలేని స్థితి. ఆ ఇద్ద‌రి రొమాన్స్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

కానీ ఏం చేసినా శ్రుతిహాస‌న్ మాత్రం కెరీర్ ని కూడా విడిచిపెట్ట‌కుండా ప్ర‌తిదీ తెలివిగా ప్లాన్ చేస్తోంది. క్రాక్ - వ‌కీల్ సాబ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో టాలీవుడ్ లో కంబ్యాక్ అయిన శ్రుతి ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీ స‌లార్ లో న‌టిస్తోంది. ప్ర‌భాస్ తో క‌లిసి ఇప్ప‌టికే షూటింగ్ లో పాల్గొంటోంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌తో శ్రుతి విరుచుకుప‌డుతోంది. గ‌త కొంత‌కాలంగా శ్రుతి స్పెష‌ల్ గోథిక్ మేక‌ప్ ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది. ఈసారి కూడా అదే త‌ర‌హాలో విభిన్న‌మైన వ‌స్త్ర‌ధార‌ణ గోథిక్ తో త‌ళుక్కున మెరిసింది. మేక‌ప్ మ‌రీ అంత టూమ‌చ్ గా లేదు కానీ.. ఎంపిక చేసుకున్న బ్లాక్ లెద‌ర్ డ్రెస్ సంథింగ్ హాట్ యాంగిల్ ని ఎలివేట్ చేస్తోంది. ఈ త‌ర‌హా డిజైన‌ర్ లుక్ హాలీవుడ్ సినిమాల్లో పాశ్చాత్య సంస్కృతిలో విస్త్ర‌తంగా క‌నిపిస్తుంది. అస‌లు సాంప్ర‌దాయాల హ‌ద్దులు చెరిపేసే హాంకాంగ్ ఇండ‌స్ట్రీ క‌ల్చ‌ర్ నే దిగుమ‌తి చేస్తోందా? అన్నంత కొత్త‌గా ఉంది శ్రుతి. ఆ జ‌ల్లెడ డ్రెస్ కి త‌గ్గ‌ట్టుగానే మెడ‌లో మెటాలిక్ చైన్ ని ధ‌రించి వేడి పెంచింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.