Begin typing your search above and press return to search.
హీరోయిన్ కిడ్నాప్ డ్రామా బెడిసి కొట్టిందే!
By: Tupaki Desk | 22 May 2023 10:21 AM GMTచిన్న సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం అంత వీజీ కాదు. రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు రకరకాల మార్గాల్ని అన్వేషించాల్సి వస్తుంది. రొటీన్ పబ్లిసిటీ చేస్తే పనవ్వదు. ఎదైనా డిఫరెంట్ గా చేయాలి. అప్పుడే కాస్తా కూస్తో ఆడియన్స్ రీచ్ అవుతుంది. ఆ తర్వాత హిట్ టాక్ వస్తే తిరిగి చూసే పనిలేదు. జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం అంతకన్నా లేదు. కంటెంట్ ఉన్నా సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో? చెప్పడానికి ఎన్నో చిన్న సినిమాలున్నాయి.
ఇలాంటి ఓ చిన్న సినిమాని వినూత్నంగా ప్రచారం చేయాలని ట్రై చేసి చేతులు కాల్చుకుంది ఓ టీమ్. పై పెచ్చు ప్రయత్నం బెడిసి కొట్టి చీవాట్లు తినాల్సి వచ్చింది. ఓ సారి ఆ వివరాల్లోకి వెళ్తే.. సునైనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'రెజీనా' అనే సినిమా త్వరలో రిలీజ్ కానుంది. డొమిన్ డిసిల్వా అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ థ్రిల్లర్ సినిమా మేకింగ్ దశలో ఉండగానే సినిమాకి బజ్ తీసుకురావాలని చేసిన ప్రయత్నం ఎలాంటిదో తెలసుకోండి.
సునైనా కిడ్నాప్ అయినట్లు ఓ వార్తను సోషల్ మీడియాలోకి వదిలారు. విషయం తెలిసిన అంతా ఆమెకు కంగారు పడి ఫోన్లు చేసారు. నెంబర్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మరింత టెన్సన్ పడ్డారు. ఏమై పోయింది? ఎక్కడికి వెళ్లింది అంటూ ఒకటే టెన్షన్ పడ్డారు. ఈ విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాకి లీక్ అవ్వడంతో సునైనా కిడ్నాప్ అంటూ వార్తలు దావానాలా వ్యపించాయి. ఆమెని ఎవరు కిడ్నాప్ చేసారు? అంత అవసరం ఎవరికి ఉంది? కిడ్నాపర్లు ఎన్నికోట్లు డిమాండ్ చేస్తున్నారు? వంటి కథనాలు కోలీవుడ్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో మ్యాటర్ లో సీరియస్ నెస్ తెలిసి సునైనా వెంటలనే లైన్ లోకి వచ్చి తాను సేఫ్ గానే ఉన్నానని.. ఎవరూ కిడ్నాప్ చేయలేదని..తన పాత్ర ఇంటెన్సిటీని చూపించడానికి ఇలా ట్రైచేసామంటూ చల్లగా విషయం చెప్పింది. దీంతో నెటి జనులు..మీడియా భగ్గుమన్నారు.
ఇంతకన్నా గ్రేట్ ఐడియా రాలేదా? ప్రచారం పేరుతో అభిమానుల్ని కంగారు పెడతారా? వాళ్ల మనోభావాలతో ఆటలాడుకుంటారా? అంటూ చిత్ర యూనిట్ పై మండిపడుతున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మరోసారి చేసి అబాసుపాలు కాకండి అంటూ హెచ్చరించారు.
ఇలాంటి ప్రయత్నాలు అప్పుడప్పుడు టాలీవుడ్ లోనూ చోటు చేసుకుంటాయి. ఫేక్ వీడియోలు చేయడం..మీడియా ఛానెల్స్ లో ఫైటింగ్ బిడేట్లు..పబ్లిక్ గా రోడ్డు షో చేయడం కథలు ఇక్కడా పడ్డారు కొందరు. బెడిసి కొట్టి అబాసు పాలు అయ్యారు.