Begin typing your search above and press return to search.

నోర్ముసుకొని పెళ్ళి చేస్కో - స్వాతి

By:  Tupaki Desk   |   4 Nov 2015 7:11 PM GMT
నోర్ముసుకొని పెళ్ళి చేస్కో - స్వాతి
X
ఈ కాలం హీరోయిన్లను పెళ్లి గురించి అడిగితే రకరకాల ఆన్సర్స్ వస్తాయి. అసలు విషయం తప్ప.. బోలెడు సోది చెబుతూ ఉంటారు. కెరీర్ అనీ, అప్పుడే తొందరేంటని, ఆలోచించలేదని.. ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి. కానీ కలర్స్ స్వాతి అలా కాదు. అంతా ఫేస్ టూ ఫేస్ తేల్చేయడమే. పెళ్లి గురించి అడిగిన ప్రతీ ప్రశ్నకి జవాబిచ్చి.. అందరినీ ఆశ్చర్యపరచింది ఈ త్రిపుర.

'గతంలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇద్దరూ ఒకటే పరిశ్రమ కరెక్ట్ కాదన్నది అప్పటి ఆలోచన. ఇప్పుడు నా మైండ్ సెట్ మారింది. ఇదే ఇండస్ట్రీ పర్సన్ అయితేనే.. నా వర్క్ కల్చర్ ను అర్ధం చేసుకోగలడని అనిపిస్తోంది' అంటోంది స్వాతి. ఇంతకీ మీ కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగితే.. 'బాగా సెటిల్ అయి ఉండాలి, అర్ధం చేసుకునే మనస్తత్వం ఉండాలి, నన్ను బాగా ప్రేమించాలి, అన్నిటికంటే ముఖ్యంగా నిజాయితీగా ఉండాలి. మనిషికి కేరక్టర్ లేకపోతే మాత్రం నాకు కోపం వచ్చేస్తుంద'ని స్వాతి చెబుతోంది.

ఇక్కడితో అయిపోలేదు.. అసలు విషయం ఆ తర్వాతే చెప్పింది స్వాతి. తనకు కరెక్ట్ పర్సన్ కనపడితే.. వెంటనే పెళ్లికి రెడీ అయిపోతుందట. ఇందుకోసం ఎలాంటి టైం ఫ్రేమ్ కూడా పెట్టుకోదట. ఒకవేళ ఎవరన్నా కనబడితే.. ఆప్షన్ కూడా ఇవ్వదట. 'నోర్మూసుకుని నన్ను పెళ్లి చేసుకోమని'అంటుందట స్వాతి. పెళ్లి చేసుకోమని అడిగే దగ్గరే అష్టాచెమ్మా ఆడేసుకుంటానని ఇన్ డైరెక్టుగా చెబుతున్నట్లు లేదూ.