Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ పాప.. చిక్కితేనే ఛాన్సులు

By:  Tupaki Desk   |   25 May 2018 5:30 PM GMT
బిగ్ బాస్ పాప.. చిక్కితేనే ఛాన్సులు
X
టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నా.. దాదాపు 7-8 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఇంకా సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోయిన భామ ఆమె. ట్రయల్స్ లో ఎఫర్ట్స్ బాగానే పెడుతుంది కానీ.. ఫిజిక్ పై మాత్రం పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఓ పెద్ద స్టార్ హోస్ట్ చేసిన ప్రతిష్టాత్మక టీవీ షో బిగ్ బాస్ లో కూడా ఈ భామ పాల్గొంది.

స్పెషల్ ఇంట్రీ ఇచ్చి మరీ డల్లుగా సాగుతున్న ఆ కార్యక్రమానికి గ్లామర్ షోకులు అద్దింది. అయితే.. ఈ వయ్యారి భామకు ప్రస్తుతం చేతిలో అవకాశాలు లేవనే చెప్పాలి. ఓ మూడు నాలుగు సినిమాలు ఉన్నాయ్ కానీ.. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలీదు. పైగా అవేవీ పెద్ద ప్రాజెక్టులు కాదు. కానీ గ్లామర్ కురిపంచే బ్యూటీ కావడంతో ఛాన్సులు ఇచ్చేందుకు మేకర్స్ రెడీగానే ఉన్నారు. కానీ అసలు సమస్య అంతా ఈ సుందరాంగి దగ్గరే వస్తోంది. గతంతో పోల్చితే ప్రస్తుతం ఈ బ్యూటీ బాగానే ఒళ్లు చేసింది.

సన్నబడితే ఆఫర్లు ఇస్తాం అంటున్నారట దర్శక నిర్మాతలు. కానీ ఆమె మాత్రం రోజూ పార్టీలూ పబ్బులూ అంటూ తాగేస్తోందట. దీంతో ఉదయాన్నే చేసిన వర్కవుట్స్ పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. ఇప్పటికీ యంగ్ భామే కావడంతో.. ఇప్పటికైనా కాసింత జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఈ భామ మరి తనేమో లావయిపోతూ.. ఆఫర్లు రావడం లేదని బాధపడడం కరెక్ట్ కాదేమో?