Begin typing your search above and press return to search.
తండ్రిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్
By: Tupaki Desk | 3 Feb 2022 8:33 AM GMTతెలుగు తో పాటు తమిళంలో సుపరిచితులైన స్టార్స్ విజయ్ కుమార్ మరియు మంజుల ముగ్గురు కూతుర్లలో ఒకరు వనిత విజయ్ కుమార్. ఇప్పటికి మూడు పెళ్లిలు చేసుకున్న వనిత విజయ్ కుమార్ నాల్గవ పెళ్లికి సిద్దం అవుతుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. పెళ్లిల విషయాలతోనే కాకుండా ఈమె తండ్రితో ఉన్న ఆస్తి తగాదాల కారణంగా మీడియాలో రెగ్యులర్ గా నిలుస్తూనే ఉంటుంది. హీరోయిన్ గా నటిగా ఈమెకు దక్కిన గుర్తింపు కంటే బిగ్ బాస్ వివాదం మరియు తండ్రితో వివాదం మరియు పెళ్లిల వల్లే ఎక్కువగా పాపులారిటీని దక్కించుకుంది. ఈమె వివాదాల కారణంగానే ఇంకా జనాల్లో ఈమె గురించిన చర్చ జరుగుతోంది. తాజాగా మరోసారి వనిత విజయ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో తండ్రి పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఆ ఇంటర్వ్యూలో వనిత విజయ్ కుమార్ మాట్లాడుతూ... అమ్మ కుటుంబం కోసం చాలా కష్టపడ్డారు. ఆమె రాత్రి పగలు తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొని ఆస్తులు సంపాదించారు. ఆమె సంపాదించిన ప్రతి పైసా కూడా మా ముగ్గురికి ఇవ్వాలని అనుకున్నారు. ఆమె చనిపోయిన తర్వాత నాన్న నాకు ఆస్తి ఇవ్వకూడదు అనుకున్నాడు.
నా వ్యక్తిగత జీవితం ఆయనకు నచ్చక పోవడంతో తమిళనాడులో నాకు అడ్రస్ లేకుండా చేస్తానంటూ ఛాలెంజ్ చేశాడు. తమిళనాడులో నేను ఉంటే ఆయనకు పరువు తక్కువ అన్నట్లుగా ఆయన ఫీల్ అవుతున్నాడు. అందుకే నన్ను పోలీసులతో బెదిరించడం మొదలుకుని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. ఆస్తి లో నాకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ వ్యాఖ్యలు చేసింది. తన తండ్రి విషయమై కోర్టు లోనే తేల్చుకుంటాను అంటూ మరో సారి చెప్పుకొచ్చింది.
ఇక మూడు పెళ్లిల గురించి ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. తాను చిన్న తనంలోనే పెళ్లి చేసుకోవడంతో వైవాహిక జీవితం సరిగా సాగలేదు. తెలిసి తెలియని వయసులో పెళ్లి జరగడం వల్ల సమస్యలు మొదలు అయ్యాయి. ఆ సమస్యలు మూడు పెళ్లిలకు కూడా కంటిన్యూ అయ్యాయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నా జీవితంను ఎంతగా బాగు చేసుకోవాలని చూసినా కూడా కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చింది.
నాల్గవ సారి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. కాని భవిష్యత్తులో నిర్ణయం మార్చుకునే అవకాశాలు లేకపోలేదు అన్నట్లుగా ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మొత్తానికి వనిత విజయ్ కుమార్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తండ్రి తో రాజీ పడేందుకు సిద్దంగా ఉన్నా కూడా ఆయన నుండి సానుకూలంగా సమాధానం రావడం లేదు అంటూ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది.