Begin typing your search above and press return to search.

పేరు మార్చుకున్న హీరోయిన్.. స్టార్ యాక్టర్ భార్య తెలుసా??

By:  Tupaki Desk   |   12 Jun 2021 8:30 AM GMT
పేరు మార్చుకున్న హీరోయిన్.. స్టార్ యాక్టర్ భార్య తెలుసా??
X
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ నటుడు గురించి వార్తలు వినిపిస్తున్నాయి అంటే మాత్రం అది ఖచ్చితంగా మనోజ్ బాజపేయ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే ఆయన ప్రధానపాత్రలో నటించిన “ది ఫ్యామిలీ మ్యాన్” రెండవ సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఆయన నిజజీవితంలో ఫ్యామిలీ మ్యాన్ అవునా.. కాదా.. అంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే సాధారణంగా అందరికి తెలియని విషయం ఏంటంటే.. మనోజ్ బాజపేయ్ భార్య కూడా ఒకప్పుడు హీరోయిన్. అంటే స్టార్ హీరోయిన్ గా వెలుగులోకి రాలేదు కానీ ఆమె చేసిన సినిమాలు వేళ్ళపై లెక్కేయవచ్చు. మనోజ్ భార్య పేరు షబానా రజా. ఆమెను స్క్రీన్ నేమ్ మాత్రం నేహా అనే పెట్టుకుంది.

ముస్లిం ఫ్యామిలీలో పుట్టిన షబానా సినీఅరంగేట్రం చేయడానికి నేహాగా పేరు మార్చుకున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఆమెను షబానా రాజా నేహా అని కూడా పిలుస్తారు. అయితే 1998లో కరీబ్ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించింది నేహా. ఆ సినిమాలో బాబీ డియోల్ హీరోగా నటించాడు. కానీ ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా 'హోగి ప్యార్ కి జీత్' లో నటించింది. అలాగే 'ఫిజా' మూవీలో హృతిక్ రోషన్ ప్రియురాలుగా కనిపించింది..డెబ్యూ ముందు షబానా అయితే మేకర్స్ బలవంతం వలన తాను నేహాగా పేరును మార్చుకున్నట్లు చెప్పింది. అంటే ఇండస్ట్రీలో హీరోయిన్స్ పేర్లను మార్చడం అనేది కొత్త విషయం కాదు. కానీ షబానాకు ఆ పద్ధతి ఇష్టం లేదంటుంది.

ఇదివరకు షబానా పలు ఇంటర్వ్యూలలో.. "నేను నేహా కాదు, నేను ఎల్లప్పుడూ షబానానే. నా పేరును నేహా కాకుండా షబానాగా ఉంచాలని అడిగాను. కానీ వారు అస్సలు పట్టించుకోకుండా నేహా పెట్టారు. నిజానికి నా తల్లిదండ్రులు గర్వంగా నాకు షబానా అని పేరు పెట్టారు. దానిని మార్చడానికి అవసరం లేదు. కానీ ఎవరూ నా మాట వినలేదు. నేను పరిశ్రమలోకి ప్రవేశించినప్పటి నుండి చాలా మార్పులు చూసాను. కానీ సంజయ్ గుప్తా గారి "అలీబాగ్" మూవీలో మాత్రం షబానా అనే పేరునే వేయించుకుంది. షబానా - మనోజ్ బాజపేయ్ 2006లో పెళ్లి చేసుకున్నారు. వారికీ ఒక కుమార్తె ఆవా నైలా. కానీ ఎప్పుడైనా తనకు నటన అనేది ఆసక్తిగానే ఉంటుందని అంటోంది ఈ స్టార్ యాక్టర్ భార్య. నాకు యాక్టింగ్ ఇంటరెస్ట్ అలాగని మేకర్స్ ఇళ్లకు వెళ్లి అవకాశాల కోసం తిరిగే రకం కాదు. బహుశా నేను చేసిన మిస్టేక్ అదేనేమో. అప్పటినుండి నాకు అవకాశాలు రాలేదు. తర్వాత యాక్టింగ్ పూర్తిగా ఆపేసాను. ప్రస్తుతం మిస్సెస్ మనోజ్ బాజపేయ్ హ్యాపీగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.